EPAPER

Vibhuti Mahima :శివుడి నుదుటిపై మూడు విభూతి రేఖల ఆంతర్యమేంటి..

Vibhuti Mahima :శివుడి నుదుటిపై మూడు విభూతి రేఖల ఆంతర్యమేంటి..
Vibhuti Mahima

Vibhuti Mahima : విభూతి లేదా భస్మం అంటే హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైనవి, కుబేర సంపద కూడా సాటి రానంతటి విశిష్టత కలిగి ఉన్నది విభూతి. నుదుటన విభూతి ధరించి చనిపోతే, వాళ్లు నరకం పోరని ఉపనిషత్తులు. చెప్తున్నాయి . విభూతిని భస్మ అని త్రయంబకం అని కూడా అంటారు. విభూతి ధారణ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పురాణాలు , శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు భస్మధారణ శైవం, వైష్ణవం కాదు. ఇది వైదిక సంస్కారమనే చెప్పాలి.


నుదుటిపై హిందువులు పెట్టుకునే మూడు విభూతి రేఖల వెనుక పరమార్థం ఉంది. మొదటిది బ్రహ్మ కి గుర్తు . రెండవది విష్ణువు కి గుర్తు .. మూడవది శంకరుడుకి గుర్తు మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు. అదే పరమాత్మని యథార్థ స్వరూపమంటారు. పరమాత్ముని నామం సదా శివ., సదా శివ అంటే సదా – ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి మంగళకారి శుభకారి అని అర్ధం.. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు. 4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో ఉంటారు.

పరమాత్మ త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడ సృష్టించినవాడు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము, ఈ ముగ్గురుతో మూడు కర్తవ్యాలను చేయించువాడు పరమాత్మడు . అందుకే ఇంగ్లీష్ లో గాడ్ అంటారు. లింగం శబ్ధము వస్తువును తెలియ చేసే చిహ్నమని చెబుతున్నారు. లక్షణములు చూపించేదని అర్థం కూడా ఉంది. పరమాత్మ లక్షణములు చూపించేదే కాబట్టే శివలింగం అంటారు . ఓం నమః శివాయ అంటే ఓం – నేను ఆత్మను నమః – నమస్కారం శివాయ -పరమాత్మడు ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం. అందరం భక్తితో అరుణాచల శివ అని రాసి స్వామి వారి అనుగ్రహం పొందవచ్చని శాస్తం చెబుతోంది. ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు .


Related News

Horoscope 7 october 2024: ఈ రాశి వారికి ధనం చేతికి అందక ఆర్థిక ఇబ్బందులు! దుర్గాస్తుతి పఠిస్తే మెరుగైన ఫలితాలు!

Navratri Jaware: ఘటస్థాపన తర్వాత ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా ? దాని అర్థం ఏంటో తెలుసా

Saturn Lucky Rashi: శని ఆట మొదలు.. ఈ 3 రాశుల వారి కష్టాలన్నీ తొలగిపోనున్నాయి

Durga Puja 2024: నవరాత్రుల చివరి రోజు ఎప్పుడు ? కుమారి పూజ నుంచి సంధి పూజ వరకు పాటించాల్సిన నియమాలు ఇవే

Durga Puja Week Love Rashifal: మాలవ్య రాజయోగంతో కర్కాటక రాశితో సహా 5 రాశుల జంటల జీవితం అద్భుతంగా ఉండబోతుంది

7 October to 13 October Horoscope : బుధ-శుక్ర సంచారం వల్ల 7 రోజుల్లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది

Shankham direction : దీపావళికి ముందు ఇంట్లో ఈ దిక్కున శంఖాన్ని ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు !

×