EPAPER

T20 World Cup 2022 : వాట్ ఎన్ ఐడియా… ఆస్ట్రేలియా…

T20 World Cup 2022 : వాట్ ఎన్ ఐడియా… ఆస్ట్రేలియా…

T20 World Cup 2022 : T-20 వరల్డ్ కప్ లో స్లో ఓవర్ రేట్ జరిమానా తప్పించుకునేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఓ అద్భుత పథకం వేసింది. దాని గురించి తెలుసుకున్న వాళ్లంతా… ఆస్ట్రేలియా, వాట్ ఎన్ ఐడియా… అనకుండా ఉండలేకపోతున్నారు.


టీ 20 వరల్డ్ కప్‌లో నిర్ణీత సమయంలోపు ఏ జట్టయినా ఓవర్లు పూర్తి చేయకపోతే జరిమానా తప్పదు. దీన్ని తప్పించుకోడానికి కంగారూ టీమ్ కొత్త స్కెచ్ వేసింది. మ్యాచ్ జరిగే సమయంలో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లను బౌండరీ లైన్ కు అవతల మోహరించాలన్నదే ఆసీస్ ప్లాన్. దాంతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లు కొడితే… రిజర్వ్ ఆటగాళ్ల ద్వారా బాల్ ను వీలైనంత త్వరగా బౌలర్ చేతికి అందించాలన్నదే ఆసీస్ వ్యూహం. అలా ఒక్కో బౌండరీకి కనీసం పది సెకన్ల సమయం మిగిలినా… ఓవరాల్ గా పది నిమిషాల సమయాన్ని ఆదా చేయవచ్చనేది ఆసీస్ ఆలోచన.

టీ 20 మ్యాచ్‌ల్లో వేగం పెంచడానికి 2022 జనవరి నుంచి ఐసీసీ స్లో ఓవర్‌ రేటుకు జరిమానా విధానాన్ని తీసుకొచ్చింది. దాని ప్రకారం.. ఫీల్డింగ్‌ జట్టు నిర్ణీత సమయంలోపు 19వ ఓవర్‌ను పూర్తి చేయాలి. ఇన్నింగ్స్‌లో 85వ నిమిషానికి కచ్చితంగా 20వ ఓవర్‌ను ప్రారంభించాలి. ఒకవేళ అలా చేయలేకపోతే.. చివరి ఓవర్‌కు 30 గజాల సర్కిల్‌ బయట ఐదుగురికి బదులు నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. అదే జరిగితే… స్లాగ్ ఓవర్లలో బ్యాటర్లు కొట్టే భారీ షాట్ల ద్వారా పరుగులు రాకుండా అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే… అలాంటి ప్రమాదం రాకుండా… ఆస్ట్రేలియా కొత్త వ్యూహం ఆలోచించింది. అది సక్సెస్ అయితే… మిగతా జట్లు కూడా ఆసీస్ నే ఫాలో అయ్యే అవకాశం ఉంది.


Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×