EPAPER

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది.. జగన్‌పై నమ్మకంతో తిరస్కరించా.. రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka: ఏపీ ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్ఠానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సీఎం జగన్ సస్పెండ్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ తనను కోరిందని వెల్లడించారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని టీడీపీ రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని వరప్రసాద్ తెలిపారు. తన స్నేహితుడు కేఎస్ఎన్ రాజుతో టీడీపీ నేతలు బేరసారాలు జరిపారని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీకి ఓటేయాలని తనను కోరారన్నారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్తుతో పాటు మంచి పొజీషన్ ఇస్తామన్నారని తెలిపారు.

కానీ ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్న నమ్మకంతో టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని రాపాక వెల్లడించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకొని తిరగలేమన్నారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ. 10 కోట్లు వచ్చేవన్నారు. కానీ తాను అలా చేయలేదని, టీడీపీ ఆఫర్‌ను తిరస్కరించానని వెల్లడించారు.


Related News

Punganur Minor Girl Incident: పుంగనూరు చిన్నారి ఘటన.. బాబు Vs జగన్

AP Flood Relief: బిగ్ అలర్ట్.. నేడే ఖాతాల్లో నగదు జమ.. డీబీటీ రూపంలో రూ.18.69 కోట్లు!

Minister Durgesh: అస్సలు అర్థం కావడం లేదు.. ఏమీ తోచడం లేదు.. ఆ ప్యాలెస్ పై మంత్రి కామెంట్

AP politics: షర్మిళ వదిలిన బాణం ఎఫెక్ట్.. టీడీపీకి తగులుతోందా.. ఆ లెటర్ అంతరార్థం అదేనా..

Politics: ఔను వారిద్దరూ కలిశారు.. ఒకరేమో సీఎం.. మరొకరేమో మాజీ సీఎం.. భేటీ అందుకేనా ?

Deputy CM: రేపు కేంద్రం సమావేశం.. నేడు పవన్ తో భేటీ.. అసలేం జరుగుతోంది ?

Ap Home Minister: కన్నీటితో.. వైసీపీకి క్లాస్ పీకిన మంత్రి వంగలపూడి అనిత.. కారణం ఏమిటంటే ?

×