EPAPER

Elon Musk : 5,500 మంది పొట్టకొట్టేందుకు రెడీ అయిన మస్క్…

Elon Musk : 5,500 మంది పొట్టకొట్టేందుకు రెడీ అయిన మస్క్…

Elon Musk : సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ కొనుగోలులో ఇప్పటికే అనేక ట్విస్ట్ లు ఇచ్చిన ఎలాన్ మస్క్… ఎలాంటి దారుణ నిర్ణయాలకు సిద్ధపడ్డాడో తాజాగా బయపడింది. ట్విట్టర్ డీల్ పూర్తయ్యాక… నెల రోజుల్లోనే 75 శాతం మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాలని మస్క్ నిర్ణయం తీసుకున్నాడని… వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టింది. ట్విట్టర్లో ప్రస్తుతం 7,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో 5,500 మంది ఉద్యోగాలను ఊడగొట్టి… కేవలం 2000 మందితో మాత్రమే ట్విట్టర్ ను నడిపేందుకు మస్క్ స్కెచ్చేశాడని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.


44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ డీల్ ను పూర్తి చేసి… 3 ఏళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసే వ్యూహాలతో పాటు… కోతలకు కూడా మస్క్ ప్లాన్ చేశాడని అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది. ట్విట్టర్‌ కొనేందుకు కావాల్సిన నిధుల సమీకరణ సమయంలోనే మస్క్ ఈ విషయాలన్నీ పెట్టుబడిదారులతో చెప్పారని వెల్లడించింది. అలా అయితేనే కంపెనీ ఆర్థికంగా బలీయంగా తయారవుతుందని మస్క్ వారికి హామీ ఇచ్చినట్లు బయటపెట్టింది. నిజానికి టిట్టర్ కూడా ఉద్యోగుల్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతోనే ఉంది. అందుకే కొత్తగా ఎవర్నీ నియమించుకోవడం లేదు. కానీ… ప్రస్తుతానికి ఎవర్నీ తొలగించే ఆలోచన లేదని ఉద్యోగులకు హామీ ఇచ్చింది.

నకిలీ ఖాతాల అంశంలో ట్విట్టర్ తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపిస్తూ డీల్ ను మస్క్ పెండింగ్ లో పెట్టడంతో… ఆ సంస్థ కోర్టుకెక్కింది. దాంతో… ఈ అక్టోబర్ 28లోపు రెండు వర్గాలు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ… న్యాయమూర్తి గడువు ఇచ్చారు. అప్పటికీ ఓ నిర్ణయానికి రాలేకపోతే… నవంబర్ నుంచి విచారణ ప్రారంభిస్తామని చెప్పారు. మరి ట్విట్టర్ మస్క్ చేతుల్లోకి వస్తుందా? వస్తే ఎంతమంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతుంది? అనేది… భవిష్యత్తే చెప్పాలి.


Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×