EPAPER

Vratham :వత్రాలు చేసే ఆచారం ఎందుకు మొదలైంది…

Vratham :వత్రాలు చేసే ఆచారం ఎందుకు మొదలైంది…
Vratham

Vratham : పెళ్ళిలో రెండు విధాలైన ఆచారాలు ఉంటాయి. అవి ఆర్యాచారాలు, దేశీయాచారాలు. పాణిగ్రహణము, సప్తపది ఆర్యాచారాలు. వీటిని వైదిక మంత్రాల ద్వారా నిర్వహిస్తారు. మంగళసూత్రధారణ దేశీయాచారము. కాబట్టి దీన్ని మంత్రాలతో కాక శ్లోకాలతో నిర్వహిస్తారు. అనేక వేడుకల సంగమమే పెళ్ళి. కొత్త దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి పెద్దలు అనేక వేడుకలు చేస్తారు. పూల చెండ్లతో బంతులాట ఒకటి. తరువాత కుండలలో బంగారం, వెండి ఉంగరాలు వేసి దంపతులతో తీయించడం మరోటి. వీటన్నింటిలోనూ తలంబ్రాలు పోసుకోవడంలో ఎంతో వినోదం ఉంటుంది. ఇటువంటి ఆచారాలు ప్రాచీన కాలం నుంచీ వస్తూ మన నిత్య జీవితంలో అంతర్భాగాలైపోయాయి.


అయితే ఈ సాంఘికాచారాలు చాలావరకు స్త్రీలకు సంబంధించినవే ఉంటాయి. ఉపనయనం మాత్రం కేవలం పురుషులకు సంబంధించినది. ఇంటి ఆడపిల్లను ఒక గృహిణిగా తీర్చిదిద్దేందుకు చేసే పద్ధతులే ఈ ఆచారాలు. ఓర్పు, మితభాషిత్వం నేర్పేందుకు మౌనవ్రతము లేదా మూగ నోము అనే అచారము ఏర్పదింది. మూగనోము దీపావళి వెళ్ళిన మరునాటినుంచి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు పదిహేను రోజులపాటు చేస్తారు. శ్రావణ మాసంలో చేసె గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఇంకా…అట్లతద్దె, నాగుల చవితి, బొమ్మల నోము మొదలైనవి. కొందరు మొక్క మొలిచిన కంద దుంపను తెచ్చి అలంకరించి పసుపు కుంకుమలతో పూజిస్తారు. దీనివల్ల కందపిలకలవలే సంతనాభివ్రుద్ధి జరుగుతుందని వీరి నమ్మకము.

సంస్కృతి సంప్రదాయాల ద్వారా సమైక్యతను చాతుతున్న భారతదెశం ఇతర దేశాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా ముందంజలో ఉందని చెప్పవచ్చు. అందుకు ఆధారం ప్రపంచ దేశాలు మన సంస్కృతి పట్ల ఆకర్షితమవుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే సంప్రదాయం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఆ సమైక్యత వారసత్వంగా తరతరాలకూ అందుతూనే ఉంది.


Related News

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Big Stories

×