EPAPER

TVS New Bike : 99 వేలకు నేవిగేషన్, వాయిస్అ సిస్టెంట్ సహా 99 స్మార్ట్ ఫీచర్లతో TVS కొత్త 125CC బైక్…

TVS New Bike : 99 వేలకు నేవిగేషన్, వాయిస్అ సిస్టెంట్ సహా 99 స్మార్ట్ ఫీచర్లతో TVS కొత్త 125CC బైక్…

TVS New Bike : TVS మోటార్స్ తన 125CC రైడర్ బైక్ ను మరింత స్మార్ట్ గా, ఆకర్షణీయంగా తీర్చిదిద్ది… సరికొత్తగా లాంచ్ చేసింది. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయకపోయినా… ఏకంగా 99 స్మార్ట్ ఫీచర్లు… 5 అంగుళాల కలర్ TFT ఇన్ట్రుమెంట్ క్లస్టర్ ఉండటం… TVS రైడర్ 125 ప్రత్యేకత. నేవిగేషన్, వాయిస్ అసిస్టెంట్, బ్లూటూత్ కనెక్టివిటీ సహా 99 ఫీచర్లు ఉన్న TVS రైడర్ 125CC బైక్ ఎక్స్ షోరూమ్ ధర 99,999. తెలుగు రాష్ట్రాల్లో ఆన్ రోడ్ ధర ప్రాంతాన్ని బట్టి లక్షా 20 వేలకు కాస్త అటూ ఇటుగా ఉంది. ఇన్ని ఫీచర్లతో అతి తక్కువ ధర కలిగిన బైక్… ప్రస్తుతం మార్కెట్లో ఇదొక్కటే.


TVS తన మెటావర్స్ ప్లాట్ ఫ్లామ్ అయిన మోటోవర్స్ లో డిజైన్ చైసిన తొలి బైక్… రైడర్ 125. అచ్చం కారులో మాదిరే ఇన్ఫోటైన్ మెంట్ ఉండటం ఈ బైక్ స్పెషాలిటీ. TVS Connect యాప్ తో రైడర్ 125CC బైక్ కు కనెక్ట్ అయి… రయ్యిమని దూసుకుపోవచ్చు. సాధారణంగా ఇంటి నుంచో ఆఫీస్ నుంచో కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే… ఫోన్ లో కచ్చితంగా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి… నేవిగేషన్ పెట్టుకుని… ఫోన్ స్క్రీన్ చూస్తూ డ్రైవ్ చేయాల్సి రావడం ఎంత ఇబ్బందో… బైక్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ అనుభవమే. TVS రైడర్ 125CCలో కంప్లీట్ నేవిగేషన్ సిస్టమ్ లేకపోయినా… ఫోన్లో గూగుల్ మ్యాప్ లో డెస్టినేషన్ పెట్టుకుంటే… ఎంత దూరంలో ఎటు వైపు వెళ్లాలో ఇన్ట్రుమెంట్ క్లస్టర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ బైక్ లో త్వరలో కంప్లీట్ నేవిగేషన్ సిస్టమ్ నూ అందుబాటులోకి తేవచ్చని చెబుతున్నారు.

గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌తో TVS రైడర్ ను కంట్రోల్‌ చేయొచ్చు. వాయిస్ కమాండ్స్ ని లెఫ్ట్ హ్యాండ్ బటన్ ద్వారా… హెల్మెట్‌ కనెక్టెడ్‌ బ్లూటూత్‌ సాయంతో ఇవ్వొచ్చు. ఇక మెనూ ఓపెన్ చేయాలంటే రైట్ హ్యాండిల్ దగ్గర బటన్ ఉంటుంది. బైక్ నడుపుతూనే… ఫోన్ నోటిఫికేషన్స్, వెదర్ అప్ డేట్స్, మ్యూజిక్ ప్లేతో పాటు… పెట్రోల్ పంప్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, పార్కులు వంటి వాటి వివరాల్ని ఇన్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారానే తెలుసుకోవచ్చు.


4 రంగుల్లో విడుదలైన TVS రైడర్ 125CC బైక్ లో… 5 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, 17 ఇంచ్ ల అల్లాయ్‌ వీల్స్‌, టెలిస్కోపిక్‌ ఫోర్క్స్‌, మొనోషాక్‌ అబ్జార్బర్స్, బ్రాస్‌ టైప్‌ ఫ్రంట్‌ డిస్క్స్‌, రియర్ డ్రమ్‌ బ్రేక్స్‌ ఫీచర్లు ఉన్నాయి. 10 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉన్న ఈ బైక్ మైలేజ్… లీటర్ పెట్రోల్ కు 57 కిలోమీటర్లు అని కంపెనీ చెబుతోంది. కేవలం 6 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది.

Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×