EPAPER

Venkatesh : వెంకీమామ స్ట్రాంగ్ సిగ్నల్.. ఇక అలాంటి పాత్రలే చేస్తాడా..?

Venkatesh : వెంకీమామ స్ట్రాంగ్ సిగ్నల్.. ఇక అలాంటి పాత్రలే చేస్తాడా..?

Venkatesh : వెంకీమామ ఓ స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చాడు. తనను ఇలా కూడా వాడుకోవచ్చని రానా నాయుడు వెబ్ సిరీస్ తో ఓ మెసేజ్ పాస్ చేశాడు. ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ చట్రం ఇంకెన్నాళ్లు..! ఆ ఇమేజ్‌తో చేసిన సినిమాల్లో కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్‌లు. మున్ముందు సీనియర్ హీరోల సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం అనుమానమే..! 250 రూపాయలు పెట్టి సీనియర్ హీరో ఫ్యామిలీ సినిమా చూడ్డానికి 25 ఏళ్ల కుర్రాడు థియేటర్‌కి వస్తాడా? నెవ్వర్. చిరంజీవి, బాలకృష్ణకు మాత్రమే ఈ కేటగిరీలో స్కోప్ ఉంది. వెంకటేశ్, నాగార్జున సినిమాలకు అద్భుతంగా ఉంటే తప్ప యూత్ ఆడియన్స్ థియేటర్లకు రారు. ఏదో దృశ్యం లాంటి ఒకటి అర సినిమాలకు తప్ప.


ఇప్పుడున్న జనరేషన్‌లో యూత్‌లో కూడా ఫాలోయింగ్ రావాలంటే.. ఈ ట్రెండ్‌కు మారాల్సిందే. దానికి బెస్ట్ ఫ్లాట్‌పామ్ ఓటీటీలే. కాలానికి తగ్గట్టుగా మారడం అంటే ఇదే. వెంకీని చూసి సీనియర్లు నేర్చుకోవాలి కూడా. ప్రయోగాలు చేయడం అంటే.. హీరోయిన్లు లేకుండా, సాంగ్స్-డ్యాన్సులు లేకుండా సినిమాలు తీయడం అని కాదు అర్ధంకాదు. ఇదిగో.. విక్టరీ వెంకటేశ్ చేశాడు చూడు అలాంటివి.

అఫ్‌కోర్స్.. రానా నాయుడు చూశాక.. విక్టరీ వెంకటేశ్‌ను యమ తిట్టుకుంటున్నారు. జి, కొబ్బరి బొండాలు ఇలాంటి చెప్పలేని ఎన్నో డబుల్ మీనింగ్ మాటలు వెంకటేశ్ నోటి వెంట వినేసరికి పాపం జనం చెవులు మూసుకున్నారు. వెంకీ సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి చూసేది. అందులో నో డౌట్. కానీ రానా నాయుడు వెబ్ సిరీస్ అలా కాదు. ఈ విషయం రిలీజ్ ముందే వెంకీ అండ్ కో హెచ్చరించారు కూడా. దయచేసి మీ అమ్మానాన్న, అక్క-చెల్లితో కలిసి చూడకండి అని ముందే వార్నింగ్ ఇచ్చారు.


ఓటీటీల్లో ఫీల్ గుడ్ మూవీలు, పిరియాడిక్ అండ్ ఆర్టిస్టిక్ మూవీలు చూడ్డానికి యూత్ రారు. అడ్వెంచరస్, యాక్షన్, కాస్త మసాలా ఉన్న సినిమాలకే ఓటు. అందుకే కదా.. ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు తీస్తున్నారనే సరికి బోలెండంత మాస్ మసాలా కంటెంట్, బూతులు పెడుతున్నది. సో ఈ విషయంలో వెంకీని తిట్టాల్సిన పని లేదు.సెక్స్, వల్గర్ లాంగ్వేజ్ ఉన్నాయని ముందే చెప్పి మరీ తన ఆడియెన్స్‌ను అలర్ట్ చేశాడు.

ఓటీటీల్లో మరీ బూతులు పెడితేనే చూస్తారు అనడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. థ్రిల్ అయ్యేలా తీసినా చాలు ఎగబడతారు. ఈసారి వెంకటేశ్ వెబ్ సిరీస్‌లో నటిస్తే.. కాస్త ఆ యాంగిల్‌లో ప్రయత్నించమని కోరుకుందాం. మొత్తానికి వెంకటేశ్‌ను తిట్టుకోవచ్చు గాని.. తనకంటూ ఓ కొత్త దారి వెతుకున్నాడు. దయచేసి తాను ఇలాగే చేస్తానని మాత్రం అనుకోకండి… ఎలాగైనా చేస్తానని మెసేజ్ ఇచ్చాడు.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×