EPAPER

Earthquake : ఉత్తర భారతదేశంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు..

Earthquake : ఉత్తర భారతదేశంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు..

Earthquake : ఉత్తర భారతదేశంలో భూకంపం అలజడి రేపింది. ఢిల్లీ సహా పలు ఉత్తరాధి రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి భారీ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.6గా నమోదైంది. అఫ్గానిస్తాన్‌లోని హిందూకుషిలో భూఉపరితలం నుంచి 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అఫ్గానిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 133 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.


మంగళవారం రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పిల్లలతో కలిసి రోడ్లపైకి వచ్చేశారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. హర్యానా, పంజాబ్, రాజస్తాన్, కశ్మీర్‌ రాష్ట్రాల్లో భూకంపనలు సంభవించాయి. జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఫోన్ల సేవలకు అంతరాయం ఏర్పడింది.

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ లో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ దేశాల్లో భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8గా నమోదైంది. పాకిస్తాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, షేక్‌పురా, స్వాత్, ముల్తాన్, షాంగ్లా ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ లో భూకంపం వల్ల గతంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. 2005లో సంభవించిన భూకంపం దాటికి 74,000 మంది మృతిచెందారు.


Related News

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

×