EPAPER

TSPSC : పేపర్ లీక్ కేసు.. సిట్ కు హైకోర్టు కీలక ఆదేశాలు..

TSPSC : పేపర్ లీక్ కేసు.. సిట్ కు హైకోర్టు కీలక ఆదేశాలు..

TSPSC : తెలంగాణలో పెనుదుమారం రేపిన TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ రిపోర్ట్ సమర్పించడానికి సమయం కావాలని రాష్ట్రం ప్రభుత్వం కోరగా.. న్యాయస్థానం 3 వారాలు గడువు ఇచ్చింది.


టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై విచారణ చేపట్టాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు. హైకోర్టులో పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ కీలక వాదనలు వినిపించారు. పేపర్ లీక్ పై దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఈ కేసులో ఇద్దరు మాత్రమే నిందితులు అని మంత్రి కేటీఆర్ చెప్పారని ఇందులో కుట్ర కోణం దాగి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకే మండలంలో 20 మందికి ఎక్కువ మార్కులు రావడంపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

ఈ కేసును సీబీఐకు అప్పగిస్తే నిజనిజాలు బయటకు వస్తాయని వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ -1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్‌పీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌ సైట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సీబీఐ లేక ఇతర స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వ్యాపమ్ స్కామ్ ను సీబీఐకు సుప్రీంకోర్టు అప్పగించిందని చెప్పారు. మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కామ్ జడ్జిమెంట్ కాపీని వివేక్ హైకోర్టుకు సమర్పించారు.


ఈ కేసు విచారణను సిట్ పారదర్శకంగా చేస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పిటిషన్ వేసిన వాళ్లకు ఈ పరీక్షల రద్దుతో సంబంధం లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ వేశారని ఆరోపించారు. లోకస్ స్టాండ్ లేదు కాబట్టి పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని కోరారు. పేపర్ లీక్ అయిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని కోర్టుకు వివరించారు. ఈ కేసులో సిట్ 9 మందిని అరెస్ట్ చేసిందని తెలిపారు. సిట్ కొన్ని మండలాలకు వెళ్లి విచారణ చేస్తుందని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు తుదిపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.

మరోవైపు TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. నాలుగో రోజు విచారణ కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో సిట్ విచారణ జరిపే అవకాశం ఉంది. రేణుక, రాజశేఖర్ సొంతూర్లకు సిట్ వెళ్తోంది. ఇప్పటికే పేపర్ లీకేజీ వ్యవహారంలో ….ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా తీస్తోంది. రాజశేఖర్, రేణుకల సన్నిహితులు, బంధువులను సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. రేణుక, రేణుక భర్త డాక్యా నాయక్ లను సిట్ ఆఫీస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. మెహిదీపట్నం ప్రాంతంలోని రేణుక సన్నిహితులను విచారిస్తున్నట్లుగా సమాచారం. కస్టడీలో ఉన్న 9 మంది నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.

సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని…అసలు దోషులు తప్పించుకునే ప్రమాదముందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. దీంతో సిట్ రేవంత్ కు నోటీసులు జారీ చేసింది. తెలిసిన సమాచారాన్ని ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది.

Related News

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Big Stories

×