EPAPER

Ugadi pachadi : ఉగాది పచ్చడిని ఏ సమయంలో తినాలి…?

Ugadi pachadi : ఉగాది పచ్చడిని ఏ సమయంలో తినాలి…?
Ugadi pachadi

Ugadi pachadi : తెలుగులోగిళ్లు ఉగాది వేడుకలతో కళకళలాడుతున్నాయి. శుభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శోభకృతు నామ తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకునే సమయం వచ్చేసింది. ఉగాది పర్వదినం మార్చి 22న బుధవారం వచ్చింది. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. తెలుగు వాళ్లల్లో ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. కొత్త సంవత్సరాన్ని ఉగాది పచ్చడితోనే ప్రారంభించడం ఆనవాయితీ. సంవత్సరాది రోజు చేసే మొదటి వంటకం కూడా ఇదే. అయితే ఈ పచ్చడి ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదట. ఉగాది పచ్చడి తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చు.


దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉదయం 6.00 గంటల నుంచి 11.00 మధ్యన తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది అత్యంత అనుకూలమైన సమయమని తెలిపారు. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడమని అర్థం. ఉగాది పచ్చడి మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తినాలి. ఉదయం 7 గంటల నుంచి 10.45 మధ్య మంచి ముహూర్తం. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం బాగుంది. అలాగే, ప్రయాణాలు కూడా ఉదయం 6.00 గంటల నుంచి 11.00 గంటలోగా చేయాలి. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 1.30 నుంచి 4.30 గంటలకు మంచిది. పడమర దిశకు ప్రయాణాలు అత్యంత శుభదాయకం. ఉత్తర ప్రయాణం పనికిరాదని పండితులు చెప్తున్నారు.

ఉప్పు:
ఉప్పు భయాన్ని సూచిస్తుంది. ఉప్పు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా మార్చుతుంది


తీపి:
తీపి ఆనందాన్ని సూచిస్తుంది . ఉగాది పచ్చడిలో బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పిత్త, వాత సమస్యల్ని దూరం చేస్తుంది.

పులుపు:
చింతపండుని మనం ఉగాది పచ్చడిలో వేస్తాము. కఫాన్ని తొలగిస్తుంది జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

కారం:
శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది జీవక్రియని పెంచుతుంది. బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. శరీరంలో ఉండే క్రిముల్ని చంపుతుంది.

చేదు:
చేదు బాధలకి సంకేతం. వేపపూత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకి పంపేస్తుంది.

వగరు:
మామిడి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి శరీరాన్ని బలంగా ఉంచుతాయి

Tags

Related News

7 October to 13 October Horoscope : బుధ-శుక్ర సంచారం వల్ల 7 రోజుల్లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది

Shankham direction : దీపావళికి ముందు ఇంట్లో ఈ దిక్కున శంఖాన్ని ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటిని ఎప్పటికీ వదిలిపెట్టదు !

Guru Favorite Zodiac: బృహస్పతి సంచారంతో ఈ 2 రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు

Durga Puja Week Lucky Rashi: ఈ వారంలో లక్ష్మీ నారాయణ యోగంతో 5 రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు

Shani Transit: దీపావళి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

Mangal Gochar 2024: అంగారకుడి సంచారంతో ఈ 3 రాశుల వారికి అపారమైన సంపద

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

×