Amritpal Singh: ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. శనివారం నుంచి పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి అతని కోసం గాలిస్తున్నారు. నిన్న పోలీసులకు చిక్కినట్టే చిక్కి అమృత్ పాల్ తెలివిగా తప్పించుకున్నాడు. దాదాపు 100కు పైగా కార్లతో అమృత్ పాల్ కాన్వాయ్‌ను చేజ్ చేసిన్పటికీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.
దీంతో ఆదివారం కూడా పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు వారిస్ పంజాబ్ దేకు చెందిన 78 మందిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో వారితో పాటు అమృత్ పాల్ సింగ్‌ను కూడా పట్టుకున్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. అమృత్ పాల్ చిక్కినట్లే చిక్కి మళ్లీ తప్పించుకున్నాడని అన్నారు. ఇంకా అతను పరారీలోనే ఉన్నాడని.. మరికొద్ది గంటల్లో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
మరోవైపు అమృత్ పాల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో పంజాబ్ మొత్తం ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. శనివారం నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలపై బ్యాన్ కంటిన్యూ అవుతోంది. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు వరకు బ్యాన్ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.