ICC: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. దాదాపు 14 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్ ఇచ్చింది. యుద్ధం నేరాలపై శుక్రవారం పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఉక్రెయిన్‌లోని పిల్లలను చట్టవ్యతిరేకంగా డిపోర్ట్ చేసినట్లు పుతిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 16 వేల మంది చిన్నారులను అక్రమ రీతిలో రష్యాకు డిపోర్ట్ చేసినట్లు అప్పట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఈక్రమంలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పుతిన్‌తో పాటు రష్యాకు చెందిన చిల్డ్రన్స్ రైట్స్ కమీషనర్ మారియాలోవా బెలోవాకు కూడా వారెంట్ జారీ చేసింది.
ఇక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై రష్యా అధికారులు స్పందించారు. ఈ అరెస్ట్ వారెంట్‌ను కొట్టిపారేశారు. ఐసీసీలో రష్యాకు భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు.