EPAPER

Gujarat: నాకు అతని భార్య కావాలి.. కోర్టు మెట్లెక్కిన యువకుడు

Gujarat: నాకు అతని భార్య కావాలి.. కోర్టు మెట్లెక్కిన యువకుడు

Gujarat: వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో ఎన్నో అనార్థాలకు దారి తీస్తున్నాయి. ప్రియుడిపై మోజుతో భార్యలు భర్తలను హత్య చేస్తుంటే.. భర్తలు ప్రియురాలిపై ప్రేమతో భార్యలను మర్డర్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. అయితే ఓ యువకుడు మాత్రం ఎవరినీ మర్డర్ చేయకుండా కోర్టు మెట్లక్కాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని తనకు అప్పజెప్పాలంటూ కోర్టును ఆశ్రయించాడు. గుజరాత్‌లోని బనస్కంద జిల్లాలో ఈ ఘటన జరిగింది.


ఓ వివాహిత కొంతకాలంగా ఓ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇటీవల అతనితో లేచిపోయింది. ఇద్దరూ కలిసి ఓ రూమ్ తీసుకొని సహజీవనం చేశారు. ఆ సమయంలో ఆ యువకుడు సహజీవనం చేయడానికి వివాహితతో బాండ్ రాయించుకొని ఆమెతో సంతకం చేయించుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాక.. వివాహిత తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత అల్లుడిని ఒప్పించి తిరిగి అత్తగారింటికి తీసుకెళ్లారు. అయితే వివాహిత వదిలిపెట్టి వెళ్లడంతో ఆందోళనకు చెందిన యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. తనతో సహజీవనం చేస్తానని ఒప్పందం కుదుర్చుకొని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయిందని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఎలాగైనా తనకు ఆమెను అప్పగించాలని కోరాడు. అయితే యువతి భర్త నుంచి విడాకులు తీసుకోలేదు కాబట్టి.. ఒప్పందం కుదుర్చుకోవడం చెల్లదని కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టిపారేసింది.


Holiday: తీరిగ్గా నిద్రపోండి.. ఉద్యోగులకు సెలవు ఇచ్చిన సంస్థ

Bhadradri:రూ.116 భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

Tags

Related News

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

×