EPAPER

Space : స్పేస్‌లో ఉన్న చెత్త.. భూభాగానికి హానికరం..!

Space : స్పేస్‌లో ఉన్న చెత్త.. భూభాగానికి హానికరం..!

Space : ప్రస్తుతం కేవలం భూమిపైనే కాదు.. స్పేస్‌లో కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎలా అంటారా..? ఈరోజుల్లో స్పేస్ టెక్నాలజీపై పరిశోధనలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ నువ్వా నేనా అన్నట్టుగా ఈ రంగంలో పోటీపడుతున్నారు. అందుకే వారికి సంబంధించిన స్పేస్‌షిప్స్, శాటిలైట్స్.. అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు అంతరిక్షంలోని చెత్తను తొలగించడం అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


స్పేస్‌లో ఇప్పటికే చాలా చెత్త పేరుకుపోయింది. అనవసరమైన శాటిలైట్స్, స్పేస్‌షిప్స్.. ఇప్పటికీ అక్కడ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీని వల్ల ఎన్నో నష్టాలు జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే స్పేస్‌లో 9 వేలకు పైగా శాటిలైట్లు చక్కర్లు కొడుతున్నాయి. 2030 వరకు ఈ సంఖ్య 60 వేలకు పైగా పెరగనుంది. అంతే కాకుండా దాదాపు 100 ట్రిలియన్‌పై అంతుచిక్కని శకలాలు తిరుగుతూ ఉన్నాయని ఆస్ట్రానాట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఈ స్పేస్ జంక్ అంతా క్లియర్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒక్కటి కానున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే స్పేస్ జంక్ చాలా అంతరిక్షంలోనే ఉండిపోవడం వల్ల దీని వల్ల భూమికి నష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే భవిష్యత్తులో అలా జరగకుండా ప్రపంచదేశాల పరిశోధకులు లీగల్‌గా ఒక ఒప్పందంపై సంతకం పెట్టారు. గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం వల్ల భూమికి ఏ నష్టం జరగదు అని వారు ఈ అగ్రిమెంట్ ద్వారా హామీ ఇచ్చారు. ఎన్నో అభివద్ధి చెందిన స్పేస్ స్టేషన్స్‌కు సంబంధించిన శాస్త్రవేత్తలు ఈ ఒప్పందంలో భాగస్వాములయ్యారు.


శాటిలైట్ల వల్ల అంతరిక్షం గురించి పూర్తి సమాచారం ఆస్ట్రానాట్స్‌కు తెలుస్తుంది. కానీ వీటి వల్ల ఒక ప్రతికూలత కూడా ఉంది. కొన్ని అవసరం లేని శాటిలైట్లు కూడా అంతరిక్షంలోనే ఉండిపోవడం వల్ల భూమి ఆర్బిట్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని స్పేస్‌లో ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. శాటిలైట్ల తయారీని, వాటిని అంతరిక్షంలోకి పంపించడాన్ని అన్ని దేశాలు సపోర్ట్ చేయడంలో భూమి ఆర్బిట్‌లో ఇవే పూర్తిగా నిండిపోయి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు సంతకం పెట్టిన ఈ అగ్రిమెంట్ ప్రకారం.. శాటిలైట్లను తయారు చేసినప్పటి నుండి అది ధ్వంసం అయిన తర్వాత తిరిగి భూమికి తీసుకురావడం వరకు బాధ్యత అంతా ప్రొడ్యూసర్స్‌దే. ఈ ప్రక్రియను పాల్గొనాలంటే ఆస్ట్రానాట్స్ మార్కెట్ కాస్ట్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత ఎర్త్ ఆర్బిట్‌లో నిండిపోయిన చెత్తను తొలగించడానికి శాస్త్రవేత్తలు ముందుకు రావడం మంచి విషయమని నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, శాంసంగ్ ఫోన్లపై ఊహకందని డిస్కౌంట్లు!

Motorola razr 50: బ్లాక్ బస్టర్ డీల్.. మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్, డోంట్ మిస్‌ బ్రో!

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

Big Stories

×