EPAPER

Space Cup : గ్రావిటీని అధిగమించిన స్పేస్ కప్.. కాఫీ ఒలికిపోకుండా..

Space Cup : గ్రావిటీని అధిగమించిన స్పేస్ కప్.. కాఫీ ఒలికిపోకుండా..
Space Cup

Space Cup : అంతరిక్షం గురించి అందరికీ తెలిసిన విషయాలు చాలా తక్కువే. స్పేస్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్నవారు మరికొన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు, ఆసక్తి చూపిస్తారు. అయితే అంతరిక్షంలో గ్రావిటీ అనేది ఉండదనేది అందరికీ తెలిసిన కొన్ని కామన్ విషయాల్లో ఒకటి. అందుకే భూమిపైన ఉపయోగించే చిన్న చిన్న వస్తువులు కూడా అంతరిక్షంలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఒక వస్తువునే ఆస్ట్రానాట్స్ తయారు చేశారు.


పరిశోధనల కోసం అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రానాట్స్.. అక్కడే కొంతకాలం గడపాల్సి ఉంటుంది. వారు పూర్తిగా కొన్ని ఆహార పదార్థాలపైన, తక్కువ మోతాదులో నీళ్లపైన ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రానాట్స్ తాగడం కోసం ప్రత్యేకంగా కొన్ని బెవరేజెస్ ఉంటాయి. వాటిని బ్యాగ్‌లలో ప్యాక్ చేసుకొని స్పేస్‌కు తీసుకెళ్తారు. కానీ ఆ బ్యాగ్‌ను ఓపెన్ చేసిన కాసేపట్లోనే వాటిని పూర్తిగా తాగేయాల్సి ఉంటుంది. లేకపోతే గ్రావిటీ లేకపోవడం వల్ల అవి అక్కడే తేలుతూ ఉంటాయి. ఇలా కాకుండా బెవరేజెస్‌ను తాగడానికి మరెన్నో విధానాలను కూడా ఆస్ట్రానాట్స్ కనుక్కున్నారు.

ఒక సీల్ వేసున్న పౌచ్‌లో డ్రింక్‌ను పోసుకొని అందులో స్ట్రా వేసుకొని తాగే అవకాశం కూడా ఉన్నట్టు ఆస్ట్రానాట్స్ గుర్తించారు. కానీ దానివల్ల దాహం తీరదని వారు తెలుసుకున్నారు. దీంతో ఆస్ట్రానాట్స్ స్పేస్‌లో లిక్విడ్స్ తాగడానికి సులభమైన మార్గమని ఏమిటని కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాతావరణంలో ఎగిరిపోకుండా ఉండే ఒక స్పేస్ కప్‌ను డిజైన్ చేయాలని నాసా నిర్ణయించుకుంది. దాంట్లో లిక్విడ్ పోసినా కూడా తేలిపోకుండా ఉండేలా డిజైనింగ్ మొదలుపెట్టింది.


ఇప్పటికే అంతరిక్షంలో ఆస్ట్రానాట్స్ కొన్నిరోజులు ఉండి పరిశోధనలు చేసేలాగా అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. దాంతో పాటు ఇప్పుడు అక్కడ ప్లింబింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకే పెరుగుతున్న టెక్నాలజీ వల్ల స్పేస్ కప్ తయారీ సులువుగా మారింది. తాజాగా నికోల్ మాన్ అనే ఆస్ట్రానాట్ స్పేస్ కప్‌పై డెమో చేసి చూపించారు. అనూహ్యంగా ఈ స్పేస్ కప్‌లో పోసిన లిక్విడ్ గ్రావిటీ లేకపోయినా కదలకుండా అందులోనే ఉంది. ఇది చూసి ఇతర ఆస్ట్రానాట్స్ ఆశ్చర్యపోయారు.

నికోల్ చేసిన ఈ స్పేస్ కప్ డెమో గురించి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. తాను ఆ స్పేస్ కప్‌లో క్యాపచినో పోసుకొని చూపించింది. గ్రావిటీ లేకపోయినా కూడా ఆ కప్.. కాఫీని తేలనివ్వలేదు. ఆఖరికి కప్‌ను తిరగేసినా కూడా కాఫీ అలాగే ఉంది. ఇది చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోయరు. ఇక ఈ స్పేస్ కప్ ప్రయోగంతో అంతరిక్షంలో ఆస్ట్రానాట్స్ లిక్విడ్స్‌ను తాగాలనుకున్నప్పడల్లా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.

Tags

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×