EPAPER
Kirrak Couples Episode 1

Ramcharan: తారక్‌తో మళ్లీ డ్యాన్స్ చేయాలని ఉంది.. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం: రామ్‌చరణ్

Ramcharan: తారక్‌తో మళ్లీ డ్యాన్స్ చేయాలని ఉంది.. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం: రామ్‌చరణ్




Ramcharan: ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. ఈ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డ్ వరించింది. ఈ సందర్భంగా నటుడు రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. నాటు నాటు సాంగ్‌కు మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పులేయాలని ఉందని తెలియజేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు రామ్ చరణ్.


‘‘ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ దక్కేలా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం నాకు ఇంకా డ్రీమ్‌లానే ఉంది. రాజమౌళి, కీరవాణిలు భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత విలువైన రత్నాలు. ఆర్ఆర్ఆర్ వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసినందకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

నా సోదరుడు ఎన్టీఆర్, కోయాక్టర్ అలియాభట్‌కు ధన్యవాదాలు. తారక్‌తో కలిసి మళ్లీ నాటు నాటు సాంగ్‌కు డ్యాన్స్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆశపడుతున్నా. అలాగే నాటు నాటు సాంగ్ రచయిత చంద్రబోస్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్-కాలభైరవలకు, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌లకు ధన్యవాదాలు. ఈ అవార్డ్ ఆర్ఆర్ఆర్ టీమ్‌కే కాదు.. భారతీయ నటీనటులందరికీ సొంతం’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినీఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడతున్నారు.


ఇక ఎన్టీఆర్ పులిబొమ్మ ఉన్న డ్రెస్సును ధరించి ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ ఓ రిపోర్టర్ ఆ డ్రెస్సు గురించి అడగగా.. ‘‘ఆర్ఆర్ఆర్‌లో నాతో కలిసి దూకిన పులి ఇదే.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ వస్త్రధారణలో వచ్చాను’’ అని సమాధానం ఇచ్చారు.

Tags

Related News

Hrithik Roshan: రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న హృతిక్..పోస్ట్ కి అర్ధం అదేనా.?

Padmapriya: అందరి ముందే చిత్రవధ చేశాడు..ఆ డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Srinu Vaitla About Aagadu: సినిమా రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత అసలు విషయం చెప్పాడు

 Devara Success Meet : పర్మిషన్ లేదు… ఇది ఫ్యాన్స్ కి కాదు ఎన్టీఆర్ కే బ్యాడ్ న్యూస్..

Mamitha Baiju : తెలుగు ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ.. ఫ్యాన్స్ హర్ట్..

Akira : మెగా ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్.. చిరు సినిమాలో అకిరా..?

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Big Stories

×