EPAPER
Kirrak Couples Episode 1

Oscars 2023: ఆస్కార్ వేదికపై ది ఎలిఫెంట్ విస్పరర్స్ అదరహో

Oscars 2023: ఆస్కార్ వేదికపై ది ఎలిఫెంట్ విస్పరర్స్ అదరహో

Oscars 2023: ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై భారతీయ షార్ట్ ఫిల్మ్ అదరగొట్టింది. దర్శకురాల కార్తికి గోన్‌సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. నిర్మాత గునీత్ మోగ్న, దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్ ఈ అవార్డును అందుకున్నారు.


రెండు అనాథ ఏగును పిల్లలు, వాటిని ఆదరించిన దంపతుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ నేడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం 42 నిమిషాల నిడివి కలిగినప్పటికీ.. దానిని రూపొందించడానికి దాదాపు 450 గంటల ఫుటేజీని చిత్రీకరించారు. తమ శ్రమకు తగిన ఫలితం దక్కినందుకు దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్ సంతోషం వ్యక్తం చేశారు. ఆకాడమీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వెస్ పుట్టి పెరిగిందంతా తమిళనాడులోని ఊటీ. చిన్నప్పటి నుంచే ప్రకృతి, వన్యప్రాణులు అంటే ఎంతో ఇష్టం ఆమెకు. తండ్రి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, తల్లికి వన్యప్రాణులంటే ఎంతో ఇష్టం ఉండడంతో.. వాళ్ల అభిరుచులే కార్తికి కూడా వచ్చాయి. ఆమె విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ, ఫొటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్‌లో పీజీ పూర్తి చేశారు.


ఇక ఐదేళ్ల క్రితం కార్తికి ఇంటికి వెళ్తుతూ.. ఓ వ్యక్తిని, అతని వెంట వెళ్తున్న ఓ ఏనుగు పిల్లను చూశారు. వెంటనే ఆగి అతనితో మాట్లాడారు. ఏనుగు పిల్ల తప్పిపోవడంతో తాను చేరదీశానని, అప్పటి నుంచి తనతోనే ఉంటుందని ఆ వ్యక్తి కార్తికితో చెప్పాడు. ఆ ఘటనే ఆమె కెరీర్ మలుపు తిప్పింది. అతని జీవిత కథ ఆధారంగా కార్తికి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్‌’ను రూపొందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించి.. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి.. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.

Tags

Related News

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. నివాళులు అర్పించిన అల్లు అర్జున్

Devara 2: మూవీలో ఈ హింట్‌ను గమనించారా.? సీక్వెల్ మొత్తం బ్లడ్ బాత్ పక్కా..

Srinu Vaitla: వెంకీట్రైన్ ఎపిసోడ్.. స్క్రిప్ట్ లో లేదు.. వాళ్లకే థాంక్స్ చెప్పాలి

Thalapathy69: విజయ్ చివరి సినిమా.. బాలయ్య హిట్ సినిమాకు రీమేక్ అని మీకు తెలుసా.. ?

Rajinikanth: తలైవా.. ఇక సినిమాలకు దూరమైతే మంచిదేమో..

Tollywood: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ అంటున్న యాటిట్యూడ్ స్టార్.. నిజమేనా..?

Big Stories

×