EPAPER
Kirrak Couples Episode 1

Natu Natu Song : చరిత్ర సృష్టించిన RRR.. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు..

Natu Natu Song : చరిత్ర సృష్టించిన RRR.. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు..

Natu Natu Song : 2023 ఆస్కార్‌ అవార్డుల వేడుకలో RRR మూవీ దుమ్మురేపింది. కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ‘నాటు నాట..’ పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది.


బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’ ఆస్కార్‌ దక్కించుకుంది.

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ కు అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఆస్కార్‌ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది.


ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. నాటు నాటు పాటను చంద్రబోస్ రాశారు. ఈ సాంగ్ ను గాయకులు కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డాన్స్ మాస్టర్. అవార్డు ప్రకటించడానికి ముందు ఈ వేడుకలో బాలీవుడ్‌ కథానాయిక దీపిక పదుకొణె స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటను ఆమె ఆస్కార్‌ వేడుకలో పరిచయం చేశారు. ఆ పాట నేపథ్యాన్ని వేడుకకు హాజరైన వారికి వివరించారు.

ఆస్కార్ వేదికపై గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో నాటు నాటు పాట పాడారు. అదే సమయంలో వెస్ట్రన్‌ డ్యాన్సర్స్ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఇలా ‘నాటు నాటు’ను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్‌ చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

Tags

Related News

Tollywood: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ అంటున్న యాటిట్యూడ్ స్టార్.. నిజమేనా..?

Prabhash: ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది.. దీంతో ప్రభాస్ రేంజ్ మరో లెవెల్..!

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ విడుదలకు భారీ ప్లాన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Rajinikanth : రజనీకాంత్ హెల్త్‌పై కీలక అప్‌డేట్.. అభిమానులను కలవరపరిచే విషయం

Thalapathy 69: విజయ్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్.. ‘లార్డ్ ఆఫ్ చరిష్మా’ వచ్చేశాడు

Vanitha Vijayakumar : వివాదాస్పద నటి నాలుగో పెళ్లి.. వరుడు ఎవరో తెలిస్తే షేక్ అవ్వాల్సిందే

Shobhitha Dulipala : పెళ్లికి ముందే పిల్లలు.. అక్కినేని కొత్త కోడలు ప్లానింగే వేరు..

Big Stories

×