Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4వ తరగతి చదువున్న సమయంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులక గురయ్యానని వెల్లడించారు. ఆయనకు భయపడి కొన్నిసార్లు మంచం కింద దాక్కున్నానని తెలిపారు. తన బాల్యమంతా గృహ హింసు బాధితురాలిగానే బతికానని అన్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నాలుగో తరగతి వరకు మేము ఆయనతోనే ఉన్నాము. అప్పుడు నన్ను అకారణంగా కొట్టేవాడు. కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేది. ఆయన ఇంట్లో అడుగుపెట్టగానే భయపడి ఎన్నోసార్లు మంచం కింద దాక్కున్నాను. ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న వాళ్లే బాధితుల ఆవేదనను ఆర్థం చేసుకోగలరు’’ అని స్వాతి మలివాల్ చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవల సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ కూడా తన చిన్నతనంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని వెల్లడించిన విషయం తెలిసిందే. తన కన్నతండ్రే 8 ఏళ్ల వయస్సులో తనపై లైంగిక దాడికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. 15 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వేధింపులకు గురయ్యానని.. ఆ తర్వాత ఎదురించడం మొదలు పెట్టానని తెలిపారు.