EPAPER

Diabetes : గర్భవతులకు డయాబెటీస్ ముప్పు.. అదే పరిష్కారం..!

Diabetes : గర్భవతులకు డయాబెటీస్ ముప్పు.. అదే పరిష్కారం..!
Diabetes

Diabetes : డయాబెటీస్ అనేది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో కామన్‌గా కనిపిస్తున్న సమస్య. దీని వల్ల తక్కువ వయసున్న వారు కూడా ఎంతో బాధపడుతున్నారు. డయాబెటీస్ వల్ల కలిగే ఎఫెక్ట్ జీవితాంతం ఉండడం బాధాకరం. అందుకే డయాబెటీస్ విషయంలో ముందు నుండే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. తాజాగా గర్భవతులు.. తమ పిల్లలకు డయాబెటీస్ సోకే అవకాశం లేకుండా ఉండాలంటే ఏం చేయాలో వైద్యులు సూచించారు.


మామూలుగా గర్భవతులకు డయాబెటీస్ ఉంటే అది పిల్లలకు సోకకుండా ఆపడం లాంటివి చేయడం చాలా కష్టం. ఒకవేళ గర్భవతులుగా ఉన్న మహిళలకు తెలియకుండా డయాబెటీస్ అటాక్ అయినా కూడా అవి బిడ్డకు కూడా డయాబెటీస్ సోకే అవకాశాన్ని పెంచుతాయి కూడా. అందుకే ప్రెగ్నెంట్ అయిన డయాబెటిక్ మహిళలు ప్రెగ్నెన్సీ 8వ వారంలో ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవడం వల్ల గెస్టేషనల్ డయాబెటీస్ మెల్లిటస్ (జీడీఎమ్) వచ్చే అవకాశాన్ని అరికట్టవచ్చని వైద్యులు కనుగొన్నారు.

డయాబెటీస్ అనేది ఒకరి నుండి మరొకరికి సోకే వ్యాధి కాదు. కానీ గర్భవతులలో ఉండే షుగర్ లెవెల్స్ ద్వారా అది పిల్లలకు కూడా సోకే అవకాశం ఉంటుంది. అందుకే వారికి ప్రెగ్నెన్సీ 10 వారాలలో ఉన్నప్పుడు షుగర్ లెవెల్‌ను బట్టి జీడీఎమ్ సోకుతుందో లేదో తెలుసుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. అంతే కాకుండా ఎనిమిదో వారంలోనే షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించుకుంటే 10వ వారం లోపు వాటిని కంట్రోల్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చన్నారు.


ఎక్కువ షుగర్ లెవెల్స్ అనేవి 10వ వారంలో ఉన్న గర్భవతులను ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్యాంక్రియాస్‌పై కూడా ప్రభావం చూపిస్తాయని తెలిపారు. ఇది ముందే కనిపెట్టడం వల్ల డయాబెటీస్‌తో పాటు మరెన్నో ఇతర హానికరక వ్యాధుల నుండి కూడా తప్పించుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. ఈరోజుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలను పాటించడానికే మొగ్గుచూపుతుందని వైద్యులు గుర్తుచేసుకున్నారు.

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×