EPAPER

Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్

Kavitha: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీలో హైటెన్షన్

Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు లాయర్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈక్రమంలో ఈడీ ఆఫీస్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేశారు.


ఇక ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న వారితో కలిసి కవితన ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై, మనిశ్ సిసోడియాను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కవితకు నైతిక మద్ధతు తెలియజేయడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, మంత్రులు ఢిల్లీలోని కవిత నివాసానికి చేరుకున్నారు. శుక్రవారం మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. న్యాయనిపుణులతో కేటీఆర్ భేటీ కానున్నారు.


Tags

Related News

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

×