EPAPER
Kirrak Couples Episode 1

C.S.I Sanatan: ‘సీఎస్ఐ సనాతన్’ మూవీ రివ్యూ

C.S.I Sanatan: ‘సీఎస్ఐ సనాతన్’ మూవీ రివ్యూ

C.S.I Sanatan: న‌టీన‌టులు: ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, రోజా, నందిని రాయ్, తారక్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్, వాసంతి తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: జి శేఖ‌ర్
మ్యూజిక్: అనీష్ సోలోమాన్
పిఆర్ఒ. జిఎస్కె మీడియా
నిర్మాత: అజ‌య్ శ్రీనివాస్
ద‌ర్శ‌కుడు: శివ‌శంక‌ర్ దేవ్
బ్యానర్: చాగంటి ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2023-03-10


వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆది సాయికుమార్ ఇటీవల ‘పులి మేక’ వెబ్ సీరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ‘పులిమేక’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆది.. ఇదే ఊపులో తను నటించిన ‘సీఎస్ఐ సనాతన్’ సినిమాను నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నూతన దర్శకుడు శివశంకర్ దేవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆది కెరీర్‌ను సక్సెస్ బాటలో పయనించేలా చేసిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం…

కథ:
విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) వీసీ అనే ఫైనాన్స్ కంపెనీకి అధిపతి. ఆ సంస్థ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల నుండి రోజుకు పది రూపాయల చొప్పన డబ్బులు వసూలు చేసి, వడ్డీలేని రుణాలను అందిస్తుంటుంది. అయితే ఆ సంస్థపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతాయి. దాంతో ఇన్వెస్టర్స్‌లో అసంతృప్తి మొదలవుతుంది. ఇదిలా ఉండగానే ఓ ఇంటర్నేషనల్ కంపెనీతో డీల్ కుదుర్చుకునేందుకు విక్రమ్ చక్రవర్తి ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకుంటాడు. ముందు రోజు రాత్రి ఆఫీస్‌లో పార్టీ జరుగుతుండగా, అతడిని ఎవరో హత్య చేస్తారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు సీఎస్ఐ(క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్) నుంచి సనాతన్ (ఆది సాయికుమార్) రంగంలోకి దిగుతాడు. వీసీ కంపెనీలో పనిచేసే ఐదుగురిని నిందితులుగా గుర్తిస్తాడు. ఆ ఐదుగురిలో విక్రమ్ చక్రవర్తిని చంపింది ఎవరు? అసలు విక్రమ్ చక్రవర్తి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరకు ఏం తేలింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:
మధ్యతరగతి ప్రజలకు భారీ రిటర్న్స్‌ను ఆశగా చూపించి, డబ్బులు గుంజడం అనేది అనేక సంస్థలు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఒక్కసారిగా తమ పెట్టుబడుల్ని తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసినప్పుడు సదరు కంపెనీలు ఐపీ పెట్టడం కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఓ భారీ స్కామ్ చుట్టూ ఈ కథ సాగుతుంది. అయితే… కంపెనీ అధినేత హత్యకు గురికావడమే ఇందులోని ట్విస్ట్. తెలుగులోనే కాదు… కొంతకాలంగా వివిధ భాషల్లో ఇలాంటి మర్డర్ మిస్టరీ మూవీస్ చాలానే వస్తున్నాయి. వెబ్ సీరిస్‌లు కూడా చాలా వచ్చాయి. సహజంగా అలాంటి వాటిల్లో పోలీస్ డిపార్ట్ మెంట్‌కు చెందిన వారు హంతకులను పట్టుకుంటారు. కానీ ఇందులో ఆ పని క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అధికారి చేస్తాడు. ఓ క్రైమ్ జరిగినప్పుడు అక్కడ దొరికే ఆధారాలను క్షణ్ణంగా పరిశీలించి, వాటి ద్వారా హంతకుడెవరనేది అంచనా వేయడమే ఈ అధికారుల పని. ఇందులో ఆ పనిని సనాతన్ చేపట్టడంతో పోలీస్ ఆఫీసర్స్‌కు పెద్దగా పని లేకుండా పోయింది. మధ్య మధ్యలో ఫ్యాష్ బ్యాక్ కు వెళ్ళి, మళ్ళీ ప్రెజెంట్‌లోకి కథ వస్తూ ఉంటుంది. దాంతో సినిమా చూసే ప్రేక్షకులు గందరగోళానికి గురవుతారు. సినిమా చాలా వరకు హీరో ఇమేజ్‌, ఎలివేషన్లకి ప్రయారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. మరోవైపు కేసులో తికమక మాదిరిగానే వచ్చే సీన్లు కూడా కొంత తికమకపెడుతుంటాయి. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌లో ప్రతిదీ డీటెయిలింగ్‌గా చెప్పే క్రమంలో కొంత బోర్‌ తెప్పిస్తుంది. కథలో వేగం లేకపోవడంతో కథ ఎంతసేపు అక్కడక్కడే తిరగడంతో చూసిన సీన్లే చూసినట్టుగా ఉండటం, తర్వాత ఏం జరుగుతుందో అనే సీన్లు కొంత ఊహించేలా ఉండటం కూడా సినిమాకి మైనస్‌గా చెప్పొచ్చు. స్క్రీన్‌ప్లేని మరింత క్రిస్పీగా రాసుకోవాల్సింది. మరింత ఎంగేజింగ్‌గా సినిమాని తెరకెక్కిస్తే నెక్ట్స్ లెవల్‌కి వెళ్లేది. దీనికి సీక్వెల్ కూడా ఉన్నట్లు ఈ సినిమా చివర్లో హింట్ ఇచ్చారు.

నటీనటుల విశ్లేషణ:
నటీనటుల విషయానికి వస్తే… టైటిల్ రోల్‌ సనాతన్ పాత్రలో చక్కగా చేశాడు. ఆది ఎంట్రీ కాస్తంత లేట్‌గా జరిగింది కానీ అక్కడ నుండి ప్రతి సన్నివేశంలో అతని ప్రెజెన్స్ ఉంది. యాక్షన్ పార్ట్‌లోనూ మెప్పించాడు. కథకు అడ్డం కాకూడదని పెద్దంతగా పాటలు పెట్టలేదు. ఉన్న ఒకటి రెండు పాటలు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. తారక్ పొన్నప్ప స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. మధుసూదన్ మంత్రి పాత్రను పోషించాడు. ఇతర ప్రధాన పాత్రలను నందిని రాయ్, మిషా నారంగ్, అలీ రెజా, వాసంతి, రవిప్రకాశ్, ఖయ్యూమ్, అప్పాజీ తదితరులు పోషించారు. ఈ చిత్రంలో ముగ్గురు సినిమా జర్నలిస్టులు కూడా నటించడం విశేషం. కుమార్, సురేష్, నాగేశ్వరరావు ముగ్గురూ ఈ చిత్రంలో కనిపించారు.

సాంకేతిక విశ్లేషణ:
డైరెక్టర్ శివశంకర్ దేవ్‌కు ఇదే ఫస్ట్ సినిమా కావడంతో తను రాసుకున్న స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో పూర్తిగా తడబడినట్లు అర్థమువుతుంది. తొలి ప్రయత్నం బాగుంది కానీ, తన ఇంపాక్ట్ చూపించేలా చేస్తే ఇంకా బాగుండేది. లాజిక్‌లపై దృష్టిపెట్టి, ఎంగేజింగ్‌గా కథని చెప్పాల్సింది. ఆ విషయంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు. కాకపోతే ఇన్‌ఫార్మెటిక్‌గా సినిమాని తీసిన తీరు బాగుంది. అనీష్‌ సోలోమన్‌ సంగీతం బాగుంది. థ్రిల్లర్‌ చిత్రాలకు ఉండాల్సినట్టుగా ఉంది. కెమెరావర్క్ మెప్పించేలా లేదు. చాలా సీన్లు కట్‌ కట్‌లాగా ఉంటాయి. కొన్ని క్లోజప్ షాట్స్‌లో కొందరి తలలు కట్ అయినట్లు కనిపించాయి. ఇక ఎడిటర్‌ ఇంకా ట్రిమ్‌ చేయాల్సింది.

రేటింగ్: 2/ 5

Tags

Related News

Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Jani Master: నువ్వు మామూలోడివి కాదయ్యో.. ఇంతమందిపై లైం*గి*క దాడా..?

Jani Master : ఆ మూవీ షూటింగ్ లో ఆమెను దారుణంగా కొట్టిన జానీ.. బయటపడ్డ మరో నిజం..

Kalki Sequel: కల్కి సీక్వెల్ పై అభిమానులలో టెన్షన్.. అసలు కారణం ఏంటంటే..?

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

R.K.Roja: జానీ మాస్టర్ పై షాకింగ్ కామెంట్.. నిజం తేల్చాలంటూ..?

Big Stories

×