EPAPER
Kirrak Couples Episode 1

Mice : ఆ ఎలుకకు ఇద్దరు తండ్రులు.. ఎలా సాధ్యమంటే..?

Mice : ఆ ఎలుకకు ఇద్దరు తండ్రులు.. ఎలా సాధ్యమంటే..?
Mice

Mice : సైన్స్ అనేది ఆకాశంలోకి రాకెట్లు పంపడం దగ్గర నుండి కృత్రిమంగా పిల్లలను పుట్టించే వరకు ఎదిగింది. అంతే కాకుండా పిల్లలు పుట్టలేని వారికి ఒకటి కాదు ఎన్నో మార్గాల్లో కృత్రిమంగా పిల్లలు పుట్టే టెక్నాలజీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా మరెన్నో టెక్నాలజీలను ఈ విషయంలో ఉపయోగపడేలా తయారు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా రెండు మగ ఎలుకల నుండి ఎగ్స్ తీసుకొని మరో ఎలుకకు జన్మనిచ్చారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఇది రీప్రడక్షన్ రంగంలోనే హాట్ టాపిక్ గా మారింది.


రెండు మగ ఎలుకల సెల్స్ సాయంతో మరో ఎలుకకు జన్మనిచ్చే ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఇదే కోణంలో మరికొన్ని పరిశోధనలు జరగనున్నాయి. ఇవి సక్సెస్ అయితే ఇద్దరు మగవారు పెళ్లి చేసుకున్నపుడు కానీ, ఇద్దరు ఆడవారు పెళ్లి చేసుకున్నపుడు కానీ వారికి సొంత బిడ్డ కలిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి పెళ్ళిలు జరిగినప్పుడు సొంత బిడ్డ కోసం సరోగసీని ఎంచుకుంటున్నారు. ఒకవేళ మనుషులపై ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఆ అవసరం ఇకపై ఉండదు. బయోలాజికల్ గా వారే సొంత బిడ్డకి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.

రెండు మగ సెల్స్ నుండి ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంతే కాకుండా వారు చేసిన ఈ సక్సెస్ ఫుల్ ప్రయోగం గురించి అంతర్జాతీయ సమ్మిట్ లో ప్రసంగించారు. ఈ టెక్నాలజీని మరింత ముందుకి తీసుకెళ్తే వచ్చే పదేళ్లలో మగ సెల్స్ మాత్రమే బిడ్డకి జన్మనిచ్చే అవకాశం లభిస్తుందని వారు చెప్తున్నారు. ఒక్కసారి ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే ఆడ సెల్స్ నుండి కూడా ఇలాంటి ప్రయోగం సాధ్యమవుతుందా లేదా అన్న విషయంపై ప్రయోగాలు జరగనున్నాయి.


ఇద్దరు బయోలాజికల్ తండ్రులతో ఒక ఎలుకకు జన్మనివ్వడం ఇది మొదటిసారి కాకపోయినా కేవలం మగ సెల్స్ ను మాత్రమే ఉపయోగించి ప్రయోగం చేయడం మాత్రం ఇదే మొదటిసారే. అందుకే ఈ ప్రయోగం సక్సెస్ ను శాస్త్రవేత్తలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఎలుకలపై సక్సెస్ అయిన ఈ ప్రయోగం మనుషుల్లో సక్సెస్ అవుతుందో లేదో చెప్పడం కొంచం కష్టమే. ప్రస్తుతం టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ ఉండడంతో రానున్న పదేళ్లలో ఈ ప్రయోగాలు జరుగుతాయని, అంతే కాకుండా సక్సెస్ కూడా అవుతాయని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Cheapest Drone Cameras: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Infinix Zero Flip: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

New Smartphone: 48 MP సోనీ సెన్సార్‌తో సరికొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. ఇంత తక్కువ ధరకేనా!

Big Stories

×