EPAPER

Kavitha : ఢిల్లీలో కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం ఆగదని హెచ్చరిక..

Kavitha : ఢిల్లీలో కవిత దీక్ష.. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం ఆగదని హెచ్చరిక..

Kavitha : ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సీతారాం ఏచూరి, తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొనన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తో ఈ దీక్షను చేపట్టారు.


రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ధరణిలో సగం.. ఆకాశంలో సగం.. అవకాశంలోనూ సగం కావాలని ఆమె స్పష్టం చేశారు. భారత సంస్కృతిలో మహిళకు పెద్ద పీట వేశారని అమ్మానాన్న అంటాం.. అందులో అమ్మ శబ్దమే ముందు ఉంటుందని వివరించారు.

రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని కవిత అన్నారు. 1996లో అప్పటి ప్రధాని దేవగౌడ హయాంలో బిల్లును ప్రవేశ పెట్టినా ఇంకా చట్టం కాలేదని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని.. ఈ బిల్లుపై అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్నారు. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకు పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీజేపీకి నిజంగా మహిళలపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు.


కవిత చేపట్టిన దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కవిత దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. వారంతా కవితతో కలిసి దీక్షలో పాల్గొన్నారు.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×