EPAPER

Submerged Temples : సముద్రంలో మునిగిపోయిన 2 ఆలయాలు

Submerged Temples : సముద్రంలో మునిగిపోయిన 2 ఆలయాలు

Submerged Temples : మహాబలిపురం.. తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాబలిపురం మొత్తం 7 ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి. కానీ అందులో 2 ఆలయాలు సముద్రంలో మునిగిపోగా, ప్రస్తుతం 5 ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి. అవే మనకు కనిపిస్తాయి. అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడోచ్చు .


బీచ్‌ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది.ప్రస్తుతం మనకు కనిపించే ఆ 5 ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాల మాదరి కనిపిస్తాయి. అవన్నీ పాండవులకు చెందిన 5 రథాలే అని చెబుతారు.ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా 200 ఏళ్లు పట్టిందట. మొత్తం 3 తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట.ఆ 5 ఆలయాల్లో సముద్రానికి దగ్గర్లో ఉన్న ఆలయం ముఖ్యమైందిగా చెబుతారు. దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాలు అన్నింటినీ కేవలం ఏకశిలతోనే నిర్మించారు.

మహాబలిపురాన్ని. క్రీస్తు శకం 7 నుంచి 9వ శతాబ్దాల నడుమ పల్లవులు నిర్మించారు.ఇక్కడి రాతి ఆలయాలు, వాటిపై ఉండే శిల్పకళ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. ఏడో శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు.


మరొక కథనం ప్రకారం అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనే రాక్షస రాజు పరిపాలించేవాడట. పేరుకు రాక్షస రాజే అయినా అతనిది చాలా జాలి గుండెనట. ఈ క్రమంలోనే అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు. దానికి అంతకుముందు మామళ్లపురం, కడల్‌మలై అనే పేర్లు కూడా ఉండేవట. కడల్‌మలై అంటే పర్వతాలు, సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం.

Related News

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

×