EPAPER

Kavitha: కవితకు ఫుల్ టెన్షన్స్.. ఢిల్లీలో ప్రెస్‌మీట్.. ఏం జరగబోతోంది?

Kavitha: కవితకు ఫుల్ టెన్షన్స్.. ఢిల్లీలో ప్రెస్‌మీట్.. ఏం జరగబోతోంది?
kavitha ed

Kavitha: ఈడీ రమ్మంది. కవిత రాలేనంది. శుక్రవారం దీక్ష ఉందని చెప్పింది. కావాలంటే శనివారం వస్తానంది. విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లింది. ఇదంతా బుధవారం ఉదయం నుంచి జరిగిన మేటర్. గురువారం మార్నింగ్ వరకూ.. ఈడీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. కవితలో టెన్షన్ పెరిగింది. తన రిక్వెస్ట్‌ను ఈడీ అంగీకరిస్తుందా? 11న విచారణకు ఓకే చెబుతుందా? లేదా? తాను శుక్రవారం జంతర్‌మంతర్ దగ్గర దీక్ష చేసుకోవచ్చా? కుదరదు గురువారమే విచారణకు రావాల్సిందే అంటే తన దీక్ష పరిస్థితి ఏంటి? ఇలా కవితను గంటల తరబడి తీవ్ర ఉత్కంఠకు గురి చేసింది ఈడీ.


బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ.. దాదాపు 24 గంటల పాటు టెన్షన్ కంటిన్యూ అయింది. ఎట్టకేళకు కవితకు ఈడీ నుంచి రిప్లై వచ్చింది. ఆమె రిక్వెస్ట్‌ను మన్నించింది. 11నే విచారణకు రావొచ్చని తెలిపింది. అంతకుముందు ఈడీని గట్టిగానే ప్రశ్నించారు కవిత. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు ఎందుకు రమ్మంటున్నారు? తన ఇంట్లోనే విచారించ వచ్చని గతంలో కోర్టు తెలిపినా తనను ఎందుకు పిలిపిస్తున్నారు? ఇంత హడావిడిగా ఎంక్వైరీ చేయడం ఎందుకు? అంటూ కవిత ఈడీకి చేసిన మెయిల్‌లో ప్రస్తావించారు. రాజకీయ కక్షలో భాగంగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు.

ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలనే దానిపై కేసీఆర్ ఫుల్‌గా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించారు. ఢిల్లీ వెళ్లేముందు కూతురుకు భరోసా కల్పించారు. కవితకు ముందస్తు బెయిల్ కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ట్రై చేస్తోందని తెలుస్తోంది.


గురువారం నాడైతే ఈడీ విచారణ లేదు. శుక్రవారం దీక్ష. మరి, శనివారం ఏం జరగబోతోందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ రోజు ఈడీ విచారణకు కవిత హాజరవుతారు. వాళ్లు ప్రశ్నిస్తారు. ఈమె సమాధానాలు చెబుతారా? అంతేనా? ఇంకేం జరగదా? అంటే ఏమో.. చేస్తే అరెస్ట్ చేస్తారేమో.. అనే ప్రచారం జరుగుతోంది. కవిత, కేసీఆర్ చూపిస్తున్న టెన్షన్‌.. మీడియా అటెన్షన్‌ను బట్టి చూస్తే.. అరెస్ట్ తప్పదేమో అనిపిస్తోంది. అదే జరిగితే.. తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు, ధర్నాలతో రచ్చ రచ్చ చేయొచ్చని అంటున్నారు. శుక్రవారమే పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం పెడుతుండటంతో.. ఆ మీటింగ్‌లో యాక్షన్ ప్లాన్ గురించి డిక్టేషన్ ఉంటుందని టాక్.

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×