EPAPER
Kirrak Couples Episode 1

Raashi Khanna: బాహుబ‌లి ఛాన్స్ వ‌దులుకున్న రాశీఖ‌న్నా.. అస‌లు విష‌యం చెప్పిన బ్యూటీ

Raashi Khanna: బాహుబ‌లి ఛాన్స్ వ‌దులుకున్న రాశీఖ‌న్నా.. అస‌లు విష‌యం చెప్పిన బ్యూటీ
Raashi Khanna

Raashi Khanna : చ‌బ్బీ బ్యూటీ రాశీ ఖన్నా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పిన ఓ విషయం తెలిసిన ఆమె ఫ్యాన్స్ అయ్యో అని అన‌నుకుంటున్నారు. అందుకు కార‌ణం.. ఆమె పాన్ ఇండియా మూవీలో ఆఫ‌ర్ పోగొట్టుకోవ‌ట‌మే. ఇంత‌కీ రాశీఖ‌న్నా చాన్స్ పోగొట్టుకున్న పాన్ ఇండియా మూవీ ఏదో కాదు.. బాహుబ‌లి. ఏంటి నిజ‌మా! అనే సందేహం రాక మాన‌దు. కానీ ఇదే అస‌లు విష‌యం. అది కూడా రాశీ ఖ‌న్నా చెప్ప‌టంతో న‌మ్మ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఇంత‌కీ రాశీ ఖ‌న్నా ఎందుక‌ని బాహుబ‌లి మూవీలో ఛాన్స్ పోగొట్టుకుంద‌నే వివ‌రాల్లోకి వెళితే,


రీసెంట్ ఇంట‌ర్వ్యూలో రాశీ ఖ‌న్నా మాట్లాడుతూ ‘‘నిజానికి నేను బాహుబలి చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగు పెట్టాల్సింది. ఆడిష‌న్‌లో కూడా పాల్గొన్నాను. బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా పాత్ర‌కు ఆడిష‌న్ చేస్తున్నార‌ని తెలిసింది. అప్ప‌టికే మ‌ద్రాస్ కేఫ్ సినిమాలో న‌టించాను. నాకు బాహుబ‌లి ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఆడిష‌న్‌కు వ‌చ్చాను. అయితే రాజ‌మౌళిగారు నన్ను చూడ‌గానే చాలా క్యూట్‌గా ఉన్నావు. నీకు బాహుబ‌లిలో అవంతిక పాత్ర కంటే.. ల‌వ్ స్టోరి అయితే బావుంటుంద‌ని అన్నారు. ఆయ‌న వెంట‌నే ఆయన ల‌వ్ స్టోరి నిర్మిస్తోన్న ఆయ‌న స్నేహితుడు ద‌గ్గ‌ర‌కి తీసుకెళ్లారు. ఆ సినిమాయే ఊహ‌లు గుస‌గుస‌లాడే. అలా బాహుబ‌లిలో చాన్స్ పోయింది. అయితే నా తొలి సినిమా ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమా ఇక్క‌డ మంచి విజ‌యాన్నిసాధించింది. వ‌రుస అవ‌కాశాలు వ‌చ్చాయి’’ అన్నారు.

మ‌రి రాజ‌మౌళిని ఆయ‌న సినిమాలో వేషం ఇవ్వ‌మ‌ని ఎప్పుడూ అడ‌గ‌లేదా? అని అడిగితే ఆయ‌న్ని క‌లిసిన‌ప్పుడంతా ఆయ‌న‌కు గుర్తు చేస్తుంటాను. ఆయ‌న త‌ప్ప‌కుండా అని న‌వ్వేస్తుంటారు అని స‌మాధానం చెప్పింది రాశీఖ‌న్నా. హిందీ, తెలుగు, త‌మిళ చిత్రాల‌తో పాటు డిజిట‌ల్ మాధ్య‌మంలోనూ రాశీఖన్నా న‌టిగా రాణిస్తోంది.


Related News

Prakash Raj: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. పవన్ ను ఇంకా రెచ్చగొడుతున్నాడే

Shobhita dhulipala: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన శోభిత.. ఊహించలేదుగా..?

Manchu Manoj: అందరూ గుడ్ డాడీ అనుకుంటున్నారు.. ఆయన వెరీ బ్యాడ్ డాడీ

Ram Charan : క్లింకారా పేస్ ను చూపించిన రామ్ చరణ్.. ఎంత క్యూట్ గా ఉందో చూశారా?

Rana Daggubati : దెయ్యంగా మారబోతున్న రానా… ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Tandel: ఈ జంటను చూస్తుంటే శివపార్వతులే కిందకు దిగి వచ్చినట్టుందే..

Harsha Sai: హర్ష సాయిపై మరో కేసు నమోదు.. అలా కూడా మోసం చేశాడట!

Big Stories

×