EPAPER
Kirrak Couples Episode 1

Kavitha: కవిత విలవిల! కేసీఆర్ గిలగిల!.. గురి చూసి కొట్టిన బీజేపీ!?

Kavitha: కవిత విలవిల! కేసీఆర్ గిలగిల!.. గురి చూసి కొట్టిన బీజేపీ!?

Kavitha: కవిత అరెస్ట్. రేపోమాపో పక్కాగా అరెస్ట్. ఇందులో నో డౌట్.. అంటున్నారు. కవితకు సైతం ఆ విషయం తెలుసని చెబుతున్నారు.వరుసబెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి.. తనను అరెస్ట్ చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తాను తప్పు చేయలేదని.. విచారణకు సహకరిస్తానని.. కవిత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.


సీబీఐ విచారించి వదిలేయగా.. ఈడీ విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియానే అరెస్ట్ చేసి జైలుకు పంపగా.. సీఎం కూతురని కవితను వదిలేసే ఛాన్స్ ఉండదని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు వ్యతిరేకంగా పక్కాగా అధారాలు ఉన్నాయని అంటుండటం.. రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్ట్‌లో కవితకు ఆయన బినామీ అని ప్రస్తావించడం.. చూస్తుంటే కవిత అరెస్ట్ తప్పకపోవచ్చని టాక్. పిళ్లై, కవితలను ఎదురెదురుగా కూర్చోబెట్టి లిక్కర్ స్కాంపై ఈడీ ప్రశ్నిస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత అట్నుంచి అటే అరెస్ట్ చేస్తారంటున్నారు.

మార్చి 10న ఢిల్లీలో కవిత దీక్ష. దశాబ్దాలుగా నానుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె దీక్షకు దిగుతుండటం కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అంటున్నారు. కవిత దీక్షకు కౌంటర్‌గానా అన్నట్టు.. మార్చి 9న ఈడీ విచారణకు పిలిచింది. మార్చి 8న ఉమెన్స్ డే నాడే నోటీసులు ఇచ్చింది. అంతా పక్కాగా జరుగుతోందని తెలిసిపోవడం లేదా?


బీజేపీ టార్గెట్‌ తాను కాదని.. కేసీఆరేనని కవిత అంటున్నారు. అంటే, బీజీపీపై దూకుడుగా వెళ్తున్న గులాబీ బాస్‌కు గట్టి షాక్ ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ డిసైడ్ అయిందా? మొయినాబాద్ ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసులో.. బీజేపీ బడా లీడర్ బీఎల్ సంతోష్‌నే టార్గెట్ చేయడాన్ని కమలదళం తట్టుకోలేకపోతోంది. అందుకే, కేసీఆర్‌ను ఇలాగే వదిలేయకుండా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోయిన కవిత విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకునేలా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చాకే.. తన అరెస్ట్‌పై మానసికంగా సిద్ధమయ్యాకే.. కవిత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. బీజేపీపై ఎదురుదాడికి దిగారని చెబుతున్నారు. ఈడీ ఎంక్వైరీలో చెప్పాల్సిన సమాధానాలను ప్రాక్టీస్ చేసేందుకే అన్నట్టు.. కవిత ఇంటర్వ్యూలన్నీ ఆ కోణంలోనే జరగడం ఇంట్రెస్టింగ్ పాయింట్.

సీబీఐ, ఈడీలను ముందుంచి విపక్షాలను బీజేపీ భయభ్రాంతులకు గురిచేస్తోందనే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. అదానీపై జరగని దాడులు.. తమపైనే ఎందుకని నిలదీస్తున్నాయి. కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలు దొరికినా.. ఆయనకు బెయిల్ వచ్చిందంటూ కేజ్రీవాల్ కౌంటర్లు వేస్తున్నారు. సిసోడియాను అరెస్ట్ చేసి ఆప్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు కవిత అరెస్ట్‌తో కేసీఆర్‌కు మైండ్ బ్లాంక్ చేయాలనేది బీజేపీ గేమ్ ప్లాన్ అంటున్నారు.

అయితే, ఈడీ నోటీసులకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు అంటున్నారు. విచారణకు పిలిస్తే వెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండని సవాల్ విసురుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయిందని.. అవినీతిపరులంతా పెవిలియన్ పట్టాల్సిందేనని.. కవితను అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా? అంటూ బండి సంజయ్ మరింత కవ్విస్తున్నారు.

ఏది ఏమైనా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం.. కూతురుపై కేసుతో కేసీఆర్ గిలగిల్లాడుతుండటం.. చూస్తుంటే.. బీజేపీ గురి చూసి కల్వకుంట్ల కుటుంబాన్ని దెబ్బ కొడుతోందనే చర్చ నడుస్తోంది.

Related News

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

Big Stories

×