EPAPER
Kirrak Couples Episode 1

KCR: కొత్త TRS పార్టీ వెనుకున్నదీ కేసీఆరేనా? అంతా గులాబీ స్కెచ్చేనా?

KCR: కొత్త TRS పార్టీ వెనుకున్నదీ కేసీఆరేనా? అంతా గులాబీ స్కెచ్చేనా?

KCR: కేసీఆర్. తెలంగాణ చాణక్యుడనే హైప్. నిద్రపోతూ కూడా రాజకీయం చేస్తారనే టాక్. గులాబీ బాస్ వ్యూహాలు మామూలుగా ఉండవు మరి. లాస్ట్ టైమ్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే స్టెప్ వేశారు. రైతు బంధు, దళిత బంధు లాంటి సంచలన పథకాలతో షాక్ ఇచ్చారు. ఈసారి కూడా ముందస్తు ఉంటుందని విపక్షాలు అంటున్నా.. కేసీఆర్ మాత్రం అలాంటిదేమీ లేదంటూ బిందాస్‌గా ఉంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కోట్లాటలో ఓట్లు చీలి.. మళ్లీ తానే గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. అయినా కూడా లోలోన ఏదో తెలీని భయం. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో.. ఎలాగైనా ఎన్నికల్లో గట్టెక్కాలని తన మెదడుకు మరింత పదును పెడుతున్నట్టున్నారు. సరికొత్త వ్యూహాలను తెర మీదకు వదులుతున్నారు. ఇదంతా ఎందుకంటే…


సడెన్‌గా బ్రేకింగ్ న్యూస్ ఎందుకు?

గత శనివారం సాయంత్రం అన్ని ప్రధాన మీడియాలో ఓ బ్రేకింగ్ న్యూస్ నడిచింది. త్వరలోనే తెలంగాణలో TRS పేరుతో కొత్త పార్టీ రాబోతోందంటూ తెగ హడావుడి చేశారు. ఇదంతా పాత న్యూసే అయినా.. మళ్లీ దాన్ని ఫ్రెష్‌గా వండి వార్చారు. ముగ్గురు కీలక నేతలు టీఆర్ఎస్ పార్టీ వెనుకున్నారనేది లేటెస్ట్ అప్‌డేట్. ఖమ్మం నుంచి పొంగులేటి పేరు పక్కాగా వినిపిస్తోంది. మిగిలిన ఇద్దరూ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రంగారెడ్డి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కావొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.


బీఆర్ఎస్‌కు పోటీగా టీఆర్ఎస్ రాబోతోందనే ప్రచారంలో ఎంతోకొంత వాస్తవం ఉందంటున్నారు. అయితే, ఆ కొత్త పార్టీ కేసీఆర్ డైరెక్షన్‌లోనే వస్తోందనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును, తెలంగాణ రైతు సమితి/ తెలంగాణ రక్షణ సమితి / తెలంగాణ రాజ్య సమితి-TRS పేరుతో కొత్త పార్టీ పెట్టించేది బీఆర్ఎస్ అధినేత కేసీఆరేననే వాదన వినిపిస్తోంది.

టీఆర్ఎస్‌తో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

అదేంటి.. టీఆర్ఎస్ పేరుతో పార్టీ వస్తే బీఆర్ఎస్‌కేగా నష్టం అనే అనుమానం రావొచ్చు. కారు గుర్తుతో పార్టీ వస్తే నష్టం కానీ.. పాత పేరుతో పార్టీ వస్తే ఆయనకు వచ్చే కష్టమేంటి? అనేది లాజిక్. ఫేస్ వ్యాల్యూ ఉన్న లీడర్ల నేతృత్వంలో కొత్త పార్టీ వస్తే.. కొంతమంది ఓటర్లు అటువైపు ఆకర్షితులు కావొచ్చు. అయితే, ఏ ఓటు బ్యాంక్ కొత్త పార్టీ వైపు మళ్లుతుందనేదే మెయిన్ పాయింట్. సంక్షేమ పథకాల లబ్దిదారులు, కేసీఆర్ పాలనను ఇష్టపడే వారు.. ఇలా అధికార పార్టీకి ఫిక్స్‌డ్ ఓట్ బ్యాంక్ ఉండనే ఉంటుంది.

వేసే వాళ్లు ఎలాగూ కారు గుర్తుకే ఓటేస్తారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే విపక్షం పంచుకోవాల్సి ఉంటుంది. ఆ వ్యతిరేక ఓటింగ్.. బీజేపీ, కాంగ్రెస్, షర్మిల పార్టీ, ప్రవీణ్ కుమార్ పార్టీల మధ్య చీలిపోతుంది. అందులోనూ ఏ కాంగ్రెస్‌కో, ఏ బీజేపీకో ఎక్కువ ఓట్లు పడి.. వారి సీట్ల సంఖ్య పెరక్కుండా.. టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీని తీసుకొస్తున్నారని.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే వ్యూహమే అంటున్నారు. ఇదంతా గులాబీ బాస్ వ్యూహమే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్‌తో ఆ ఇద్దరిపై మైండ్ గేమ్?

ఇటీవల బీఆర్ఎస్ రెబెల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీని అర్థం.. ఆయన మళ్లీ బీఆర్ఎస్‌లో చేరడం కాదని.. టీఆర్ఎస్ పేరుతో కేసీఆర్‌కు సాయం చేయడమేనని అంటున్నారు. పొంగులేటి కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం వరకూ ఓకే. దానికో లెక్కుంది. కానీ, తాజాగా ముగ్గురు కీలక నేతల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అంటూ.. ప్రచారం చేయిస్తూ.. గులాబీ బాస్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అనుమానిస్తున్నారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డిలపై అనుమానం వచ్చేలా చేసేందుకే.. ఆ రెండు జిల్లాల పేర్లను ప్రచారంలో ఉంచారని చెబుతున్నారు. బీజేపీలో ఉన్న కోల్డ్‌వార్‌ను క్యాష్ చేసుకుంటూ.. ఈటల మరింత టార్గెట్ అయ్యేలా ఆయన పేరుపై లీకులు ఇస్తున్నారని అంటున్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ పేరుతో గులాబీ బాసే బిగ్ పొలిటికల్ స్కెచ్ వేశారనేది విశ్లేషకుల మాట. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

Related News

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Shock To KCR: కేటీఆర్‌కి మాజీ BRS ఎమ్మెల్యేలు షాక్.. కారణం ఇదేనా?

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Vijayasai Reddy to Join in TDP: టీడీపీలోకి విజయసాయిరెడ్డి? బాంబు పేల్చిన అచ్చెన్న..

Israeli airstrikes on Beirut: లెబనాన్ రాజధాని బీరుట్‌పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు

Big Stories

×