EPAPER

Komatireddy :కోమటిరెడ్డిపై కేసు నమోదు.. అరెస్ట్ చేస్తారా..?

Komatireddy :కోమటిరెడ్డిపై కేసు నమోదు.. అరెస్ట్ చేస్తారా..?

Komatireddy : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కేసు నమోదైంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ను ఫోన్‌లో కోమటిరెడ్డి బెదిరించిన ఆడియో వైరల్ అయ్యింది. కోమటిరెడ్డి బెదిరింపులపై సోమవారం నల్గొండ జిల్లా ఎస్పీకి సుహాస్‌ ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తనకు ప్రాణహాని ఉందంటూ నల్గొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు 506 సెక్షన్‌ కింద కోమటిరెడ్డిపై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ప్రశ్నించేందుకు కోమటిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారా..? అనే అంశం ఉత్కంఠగా మారింది.


చెరుకు సుధాకర్ కుమారుడికి ఇచ్చిన వార్నింగ్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాను భావోద్వేగంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. వేరే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరినీ దూషించలేదని చెప్పుకొచ్చారు. చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్‌ పెడితే ఎత్తివేయాలని తానే పోరాటం చేశానని గుర్తు చేశారు. తనపై విమర్శలు చేయవద్దనే సుధాకర్‌ కుమారుడికి చెప్పానన్నారు. తన మాటలను కట్‌ చేసి కొన్ని వ్యాఖ్యలను మాత్రమే లీక్‌ చేశారని ఆరోపించారు.

కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌లో ఏముందంటే..
‘మీ నాన్న వీడియో చూసావా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టాడు.నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతారు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించాను. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతాను. నిన్ను కూడా చంపేస్తారు. నీ హాస్పిటల్‌ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని కోమటిరెడ్డి ఫోన్ లో చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ తో మాట్లాడారు.


ఈ ఆడియోను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పంపించానని చెరుకు సుధాకర్‌ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి.. తనపై చేసిన వ్యాఖ్యలపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే కోమటిరెడ్డిపై అనేక వివాదాలున్నాయి. సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మునుగోడు ఉపఎన్నిక సమయంలో విమర్శలు వచ్చాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటుందా..?

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

×