EPAPER

YCP vs TDP: నందిగామలో కామెంట్.. అనంతలో ఫైటింగ్.. పొలిటికల్ నాన్సెన్స్!

YCP vs TDP: నందిగామలో కామెంట్.. అనంతలో ఫైటింగ్.. పొలిటికల్ నాన్సెన్స్!

YCP vs TDP: ఇక్కడ స్విచ్ వేస్తే ఎక్కడో బల్బ్ వెలిగినట్టు.. అక్కడెక్కడో మొదలైన డైలాగ్ వార్, ఇంకెక్కడో పొలిటికల్ ఫైట్‌కు దారి తీసింది. నందిగామ యువకుడి వీరావేశం.. అనంతపురం క్లాక్ టావర్ దగ్గర రాళ్ల దాడికి దారితీసింది. పరిటాల కుటుంబం, తోపుదుర్తి వర్గం మధ్య మంట రాజేసింది. ‘జాకీ’ కంపెనీ ఇష్యూ మళ్లీ రాజేసింది. ఇలా ఓ వ్యక్తి నోటి దురుసు.. నానారచ్చకు కారణమైంది. ఇంతకీ అసలేం జరిగిందంటే…


నందిగామలో ఉండే హరికృష్ణరెడ్డి వైసీపీ వీరాభిమాని. సోషల్ మీడియాలో టీడీపీని తిడుతూ, వైసీపీకి సపోర్ట్‌గా రెగ్యులర్‌గా పోస్టులు పెడుతుంటాడు. అలానే అనంతపురం జిల్లాలోని ‘జాకీ’ కంపెనీపైనా స్పందించాడు. జాకీ పేరుతో భూముల అక్రమాలు చేశారంటూ.. నారా లోకేశ్‌, పరిటాల ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేశారు. హరికృష్ణరెడ్డి పెట్టిన ఆ పోస్టుకు కౌంటర్‌గా ఓ టీడీపీ నాయకుడు, పరిటాల కుటుంబం అభిమాని ఇంకో వీడియో పోస్ట్ చేశాడు. పరిటాలపై విమర్శలు చేస్తే ఊరుకోమని.. నందిగామలో ఉండి పోస్టులు పెట్టడం కాదు.. దమ్ముంటే రాప్తాడురా చూసుకుందాం అంటూ సవాల్ చేశాడు. ఇదే ఛాన్స్‌గా.. మరింత రెచ్చిపోయాడు హరికృష్ణరెడ్డి. తాను ఫలానా టైమ్‌కి రాప్తాడు వస్తున్నానంటూ ఒకరోజు ముందే వీడియో పెట్టాడు. అన్నట్టుగానే రాప్తాడు టీడీపీ ఆఫీసు ముందు నిలబడి వీడియో తీసి ప్రతిసవాల్ చేశాడు. మీ ఆఫీసు ముందే ఉన్నా.. ఇక్కడి నుంచి అనంతపురం టౌన్‌లోని క్లాక్ టవర్ దగ్గరకు సరిగ్గా ఉదయం 10 గంటలకు వస్తానని.. దమ్ముంటే అడ్డుకోమని టీడీపీ వర్గీయులను ఛాలెంజ్ చేశాడు హరికృష్ణరెడ్డి.

అన్నట్టుగానే సమయానికి క్లాక్ టవర్ దగ్గరకు వచ్చాడు ఆ వైసీపీ అభిమాని. అప్పటికే టీడీపీ వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. ప్రతిగా స్థానిక వైసీపీ నేతలు సైతం హరికృష్ణరెడ్డికి సపోర్ట్‌గా వచ్చారు. పరస్పరం ఎదురుపడగా గొడవకు దిగారు. విషయం తెలిసి పోలీసులు ఎంటరై.. హరికృష్ణరెడ్డిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. టీడీపీ నాయకులు అతనిపై దాడికి ప్రయత్నించారు. వైసీపీ, టీడీపీ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ కానిస్టేబుల్‌కి, మరో టీడీపీ కార్యకర్త తలకు దెబ్బ తగిలింది. హరికృష్ణరెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి వ్యాన్‌లో తీసుకెళ్లిపోయారు పోలీసులు.


ఇలా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అనంతపురం క్లాక్ సెంటర్ రణరంగంగా మారింది. ఎక్కడి నందిగామ.. ఇంకెక్కడి అనంత. ఇన్నాళ్లూ సోషల్ మీడియాకే పరిమితమైన పైత్యం.. ఇప్పుడిలా నేరుగా లోకల్ ఫైట్‌కి దారి తీయడం కలకలం రేపుతోంది. ఒక్క ఘటనతో హరికృష్ణరెడ్డి వైసీపీ అభిమానులకు హీరోగా మారిపోయాడు. తమకూ ఇలాంటి ఇమేజే కావాలంటూ.. ఇంకొందరూ ఇలానే రెచ్చగొడుతూ.. రోడ్లపై ఫైటింగులకు దిగితే..? వచ్చే ఎన్నికల నాటికి ఏపీ పాలిటిక్స్ ఇంకెంత హీట్ పుట్టిస్తాయో? అనే టెన్షన్ నెలకొంది.

Related News

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Big Stories

×