EPAPER

Psychological : సైకాలజికల్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు..!

Psychological : సైకాలజికల్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు..!
Psychological

Psychological : ఒకప్పుడు ఒక వృత్తిలో పనిచేయాలంటే కేవలం ఆ వృత్తికి సంబంధించిన పనుల గురించి పూర్తి అవగాహన ఉంటే చాలు.. కానీ ఇప్పుడు అలా కాదు.. ఒక వృత్తిలో పనిచేస్తూ ఉన్నా కూడా ఇతర రంగాల గురించి ఐడియా ఉండి ఉండాలి. అలా అయితేనే సంస్థలు కూడా వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తాయి. అతే తరహాలో టెలికాం సంస్థల్లో పనిచేయాలంటే కేవలం దాని గురించి తెలియడం మాత్రమే కాకుండా సైకాలజీ కూడా తెలియాలి అంటున్నాయి సంస్థలు.


సైకాలజీకి, టెలికాంకు అసలు సంబంధం ఏంటని అందరికీ కామన్‌గా వచ్చే సందేహం. కానీ సైకాలజికల్ స్కిల్స్ ఉండే వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడానికి టెలికాం సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా 5జీ విభాగంలో పనిచేయడానికి టెక్నికల్ అవగాహనతో పాటు ఇంజనీర్లు.. సైకాలజీలో కూడా కోర్సు చేసి ఉండాలని సంస్థలు ఆశిస్తున్నాయి. టెలికాం ఎగ్జిక్యూటివ్స్, స్టాఫింగ్ ఫర్మ్స్ లాంటి పోస్టులు కూడా సైకాలజీ తప్పనిసరి అని అంటున్నాయి. ఈ కండీషన్ ఇంజనీర్లను ఇబ్బందుల్లో పడేలాగా చేస్తోంది.

మామూలుగా ఇంజనీర్లు.. టెక్నాలజీ విషయంలో స్పీడ్‌గా ఉండగలుగుతారు.. కానీ కస్టమర్లతో మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకొని సంస్థను పైకి తీసుకురావాలంటే సైకాలజికల్ స్కిల్స్ ఉండాలని సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. కస్టమర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటేనే ప్రొడక్ట్స్, సర్వీసుల విషయంలో మెరుగుపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ముందుగా ఇండియాలోని రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్.. ఈ స్ట్రాటజీని అప్లై చేస్తోంది. ఉద్యోగుల సామర్థ్యం కేవలం వారి ప్రొఫైల్‌కే పరిమితం అవ్వకూడదని ఈ సంస్థ భావిస్తోంది.


టెలికాం సంస్థలు ఇలా భావించడంలో ఆశ్చర్యం లేదని నిపుణులు చెప్తున్నారు. సంస్థలకు, కస్టమర్లకు మధ్య సాన్నిహిత్య సంబంధాలు లేకపోవడం వల్లే కొన్ని సంస్థలు యూజర్లను కోల్పోతున్నాయని వారు గుర్తుచేశారు. అందుకే కేవలం ఉద్యోగానికి కావాల్సిన ప్రొఫైల్‌తో పాటు కస్టమర్లను ఆకర్షించే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని సంస్థలు భావిస్తున్నాయన్నారు. టెక్నాలజీతో సైకాలజీ, టెక్నాలజీతో మార్కెటింగ్.. ఇలాంటి రెండు టాలెంట్లు కలిపి ఉంటే ఉద్యోగం విషయంలో సక్సెస్ సాధించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Tags

Related News

Poco F6 5G Price Drop: ఇదేం ఆఫర్ సామీ.. ఏకంగా రూ.8000 డిస్కౌంట్, ఇప్పుడు తక్కువకే కొనేయొచ్చు!

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Big Stories

×