EPAPER

Zoom : జూమ్ లో భారీగా ఉద్యోగాలు తొలగింపు.. ప్రెసిడెంట్ పైనా వేటు..

Zoom : జూమ్ లో భారీగా ఉద్యోగాలు తొలగింపు.. ప్రెసిడెంట్ పైనా వేటు..

Zoom : వీడియో కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ ఉద్యోగులను తగ్గించుకునే పని చేపట్టింది. ఏకంగా కంపెనీ ప్రెసిడెంట్ గ్రెగ్ టూంబ్ ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. 2022 జూన్‌లో కంపెనీ ప్రెసిడెంట్ గా గ్రెగ్ ను ప్రమోట్‌ చేసింది. ఏడాది కాకుండానే ఆయనను తొలగించి షాక్ ఇచ్చింది. జూమ్ కొత్త ప్రెసిడెంట్ గా ఎవరిని నియమిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతానికి కొత్త బాస్ ను నియమించే యోచన లేదని తెలుస్తోంది.


2019లో జూమ్‌లో చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా గ్రెగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రమోషన్‌పై ప్రెసిడెంట్‌ అయ్యారు. జూమ్ లో చేరక ముందు గ్రెగ్‌ గూగుల్‌లో విక్రయాలు, వర్క్‌స్పేస్‌, సెక్యూరిటీ, జియో ఎంటర్‌ప్రైజ్‌ విభాగాలకు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

మరోవైపు జూమ్‌ ఫిబ్రవరిలో భారీగా ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. మొత్తం 1,300 మందికి ఉద్వాసన పలికింది. అంటే కంపెనీలో దాదాపు 15 శాతం ఉద్యోగులను తొలగించింది. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న తమ సిబ్బందికి చట్ట ప్రకారం 16 వారాల వేతనం, హెల్త్‌కేర్‌ కవరేజీ, 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బోనస్‌, 6నెలలపాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇచ్చింది. అమెరికాయేతర దేశాల్లోని తమ ఉద్యోగుల కోసం ఆగస్టు 9 వరకు సమయం ఇచ్చింది.


వ్యాపారాల్లో ఇబ్బందికర పరిస్థితులను తొలగించడానికి జూమ్‌ను ఏర్పాటు చేశామని కంపెనీ పేర్కొంది. కొవిడ్‌ సమయంలో కంపెనీ దశ మారిందని తెలిపింది. దీంతో ప్రజల మధ్య కనెక్టివిటీని పెంచడానికి వేగవంతంగా నియామకాలు చేపట్టామని వివరించింది. 24 నెలల్లో సంస్థ 3 రెట్ల వృద్ధిని సాధించిందని వెల్లడించింది. మరోవైపు నిర్వహణ ఖర్చులను తగ్గించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన వార్షిక వేతనంలో 98 శాతం కోత విధించుకున్నట్లు కంపెనీ సీఈవో ఎరిక్‌ యువాన్‌ ప్రకటించారు. ఎగ్జిక్యూటీవ్‌ బోనస్‌ను వదులుకున్నానని తెలిపారు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×