EPAPER
Kirrak Couples Episode 1

AP GIS: 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 352 ఎంవోయూలు.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్..

AP GIS: 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 352 ఎంవోయూలు.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్..

AP GIS: పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో మొత్తం 352 ఎంవోయూలు జరిగాయి. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం అయిందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వ్యాపారవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 15 కీలక రంగాల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీని ద్వారా దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని అన్నారు.

పారదర్శకపాలనతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూ.. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


ఇక ఏపీలో రెండు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్‌ తరఫున గౌతమ్‌ అదానీ తనయుడు కరణ్‌ అదానీ ప్రకటించారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కడప, నడికుడిలో సిమెంట్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విశాఖలో 400 MW డేటా సెంటర్‌ను నెలకొల్పుతామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో 15వేల మెగావాట్ల పునరుత్పాదక పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అదానీ ఫౌండేషన్‌ సేవలను సైతం ఏపీకి విస్తరిస్తామని తెలిపారు.

ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో కేజీ డి-6 బేసిన్‌లో రూ.1.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు చెప్పారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.

ఏపీలోని కృష్ణపట్నం సమీపంలో 10వేల కోట్ల పెట్టుబడితో.. 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ విశాఖ వేదికగా తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.

అదానీ, అంబానీ, జిందాల్‌లే కాకుండా.. ఇంకా అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….

ఎన్టీపీసా ఎంవోయూ (రూ. 2.35 లక్షల కోట్లు)

ఏబీసీ లిమిటెట్‌ ఎంవోయూ (1.20 లక్షల కోట్లు)

రెన్యూ పవర్‌ ఎంవోయూ (97,550 కోట్లు)

ఇండోసాల్‌ ఎంవోయూ (76,033 కోట్లు)

ఏసీఎమ్‌ఈ ఎంవోయూ (68,976 కోట్లు)

టీఈపీఎస్‌ఓఎల్‌ ఎంవోయూ (65,000 కోట్లు)

జేఎస్‌డబ్యూ గ్రూప్‌ (50,632 కోట్లు)

హంచ్‌ వెంచర్స్‌ (50,000 కోట్లు)

అవాదా గ్రూప్‌ (50,000 కోట్లు)

గ్రీన్‌ కో ఎంవోయూ (47,600 కోట్లు)

ఓసీఐఓఆర్‌ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు)

హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ (రూ. 30వేల కోట్లు)

వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (21,844 కోట్లు)

అదానీ ఎనర్జీ గ్రూప్‌ (21,820 కోట్లు)

ఎకోరెన్‌ ఎనర్జీ (15,500 కోట్లు)

సెరంటికా ఎంవోయూ (12,500 కోట్లు)

ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (12వేల కోట్లు)

అరబిందో గ్రూప్‌ (10,365 కోట్లు)

ఓ2 పవర్‌ ఎంవోయూ (10వేల కోట్లు)

ఏజీపీ సిటీ గ్యాస్‌ (10వేల కోట్లు)

జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (10వేల కోట్లు)

ఆదిత్య బిర్లా గ్రూప్‌ (9,300 కోట్లు)

జిందాల్‌ స్టీల్‌ (7500 కోట్లు)

టీసీఎల్‌ ఎంవోయూ(5,500 కోట్లు)

ఏఎం గ్రీన్‌ ఎనర్జీ (5,000 కోట్లు)

ఉత్కర్ష అల్యూమినియం (4,500 కోట్లు)

ఐపోసీఎల్‌ ఎంవోయూ (4,300 కోట్లు)

వర్షిణి పవర్‌ ఎంవోయూ (4,200 ‍కోట్లు)

ఆశ్రయం ఇన్‌ఫ్రా (3,500 కోట్లు)

మైహోమ్‌ ఎంవోయూ (3,100 కోట్లు)

వెనికా జల విద్యుత్‌ ఎంవోయూ (3000 కోట్లు)

డైకిన్‌ ఎంవోయూ (2,600 కోట్లు)

సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ (2,500 కోట్లు)

భూమి వరల్డ్‌ ఎంవోయూ (2,500 కోట్లు)

అల్ట్రాటెక్‌ ఎంవోయూ (2,500 కోట్లు)

ఆంధ్రా పేపర్‌ ఎంవోయూ (2వేల కోట్లు)

మోండాలెజ్‌ ఎంవోయూ (1,600 కోట్లు)

అంప్లస్‌ ఎనర్జీ (1,500 కోట్లు)

గ్రిడ్‌ ఎడ్జ్‌ వర్క్స్‌ ఎంవోయూ (1,500 కోట్లు)

టీవీఎస్‌ ఎంవోయూ (1,500 కోట్లు)

హైజెన్‌కో ఎంవోయూ (1,500 కోట్లు)

వెల్స్‌పన్‌ ఎంవోయూ (రూ. 1,500 కోట్లు)

ఒబెరాయ్‌ గ్రూప్‌(రూ. 1,350 కోట్లు)

దేవభూమి రోప్‌వేస్‌(రూ. 1,250 కోట్లు)

సాగర్‌ పవర్‌ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు)

లారస్‌ గ్రూప్‌(రూ. 1,210 కోట్లు)

ఎలక్ట్రో స్టీల్‌ క్యాస్టింగ్స్‌(రూ. 1,113 కోట్లు)

డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌(రూ. 1,110 ‍కోట్లు)

దివీస్‌ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు)

డ్రీమ్‌ వ్యాలీ గ్రూప్‌(రూ. 1,080 కోట్లు)

భ్రమరాంబ గ్రూప్‌(రూ. 1,038 కోట్లు)

మంజీరాహోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌(రూ. 1,000 కోట్లు)

ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌(రూ. 1,000 కోట్లు)

శారదా మెటల్స్‌ అండ్‌ అల్లాయిస్‌(రూ. 1,000 కోట్లు)

ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్టక్షన్స్‌(రూ. 1,000 కోట్లు)

సెల్‌కాన్‌ ఎంవోయూ(రూ.1,000 కోట్లు)

తుని హోటల్స్‌ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు)

విష్ణు కెమికల్స్‌(రూ. 1,000 కోట్లు)

Related News

Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: ఏపీని కుదిపేస్తున్న కల్తీ లడ్డూ ఇష్యూ.. జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Pawan Kalyan Prayaschitta Deeksha: ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్.. టీటీడీ బోర్డు ఏం చేసింది ?

Rangaraya Medical College Issue: రంగరాయ మెడికల్ కాలేజీ ఘటన.. దిగొచ్చిన ఎమ్మెల్యే.. డాక్టర్ కు క్షమాపణ

Kadambari Jethwani Case: జెత్వానీ కేసులో నెక్స్ట్ కటకటాల పాలయ్యేది ఎవరంటే?

Road Accident: ఏపీలో నెత్తురోడిన రహదారులు..ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు స్పాట్ డెడ్

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Big Stories

×