EPAPER
Kirrak Couples Episode 1

Vinayaka:లక్ష్మీదేవి తొడపై వినాయక విగ్రహం ఉండకూడదా….

Vinayaka:లక్ష్మీదేవి తొడపై వినాయక విగ్రహం ఉండకూడదా….

Vinayaka:హిందూ మత గ్రంధాల ప్రకారం.. గణేషుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీ దేవి సంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే ప్రతీ హిందువు ఇళ్లలో లక్ష్మీ దేవి, గణేషుడి విగ్రహాలు, చిత్రపటాలు తప్పనిసరిగా ఉంటాయి.


చాలా ఆలయాల్లో లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకున్న వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఇది శాస్త్ర సమ్మతం కాదన్న నమ్మకం కొందరిలో ఉంది. విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని వినాయకుడు తొడపై కూర్చోపెట్టుకోవడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్న ఉంది. దేవతల భార్య అనే విషయం ముందు అర్థం చేసుకోండి. దేవతల శక్తినే మనం భార్యగా చూస్తున్నాం. విష్ణు శక్తి పేరు లక్ష్మి – అందుకే నారాయణుడు లక్ష్మినారాయణుడిగా పిలవబడుతున్నారు.

పరమాత్మ ఈశ్వరుడు అయితే ఆ శక్తి ఈశ్వరి, ఇలా ప్రతి దేవతకి శక్తి భార్యగా ఉంటుంది. అలాగే గణపతి యొక్క శక్తి పేరు వల్లభ దేవి ఈమె మరో పేరు లక్ష్మి కాబట్టే వల్లభ గణపతి లేదా లక్ష్మి గణపతి అని పేరు వచ్చింది. ఇంకొక ప్రధాన విషయం విద్యా గణపతి అంటే విద్యా యొక్క భర్త అని గ్రహించకుండా విద్యని ఇచ్చే గణపతి గా అర్థం చేసుకోవాలి.


లక్ష్మి గణపతి అంటే లక్ష్మి కటాక్షం కురిపించే గణపతి అని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి విష్ణు పత్నీ ఆయన తొడ మెడ కూర్చొంది అనే అలోచన చాలా తప్పు. ఆయన తొడ మీద ఉన్న అమ్మవారి పేరు కూడా లక్ష్మి వల్లభ దేవి. ఈమె గణపతి యొక్క శక్తి భార్య కూడా . కాబట్టి ఆగమ శాస్త్రం లో వీటికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి వాటిని కొంత అర్థం చేసుకుంటే ఇలాంటి సందేహాలు తొలగిపోతాయి.

Moon:చంద్రుడికి నైవేద్యం ఇచ్చే ఫలితాలు

Anugraham:అనుమతిదేవీ అనుగ్రహం కలగాలంటే…

Related News

Shukra Gochar 2024: అక్టోబర్ 13 వరకు వీరికి తిరుగులేదు

Weekly Horoscope (22-28): సెప్టెంబర్ 22- 28 వరకు వారఫలాలు

Surya Grahan 2024 Negative Effect: సూర్య గ్రహణం కారణంగా 5 రాశుల వారికి అనేక ఇబ్బందులు

Weekly Lucky Zodiac Sign: సెప్టెంబరు చివరి వారంలో ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం

Horoscope 22 September 2024: నేటి రాశి ఫలాలు.. శత్రువుల నుంచి ప్రమాదం! శని శ్లోకం చదవాలి!

Sharad Purnima 2024: అక్టోబర్‌లో శరద్ పూర్ణిమ ఎప్పుడు ? అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి ?

Surya-Ketu Gochar: 111 సంవత్సరాల తర్వాత సూర్య-కేతువుల అరుదైన కలయికతో అద్భుతం జరగబోతుంది

Big Stories

×