EPAPER

Parental Blessing:తల్లిదండ్రుల్ని ఆశీర్వాదం ఆసమయంలో తీసుకుంటే….

Parental Blessing:తల్లిదండ్రుల్ని ఆశీర్వాదం ఆసమయంలో తీసుకుంటే….

Parental Blessing:తల్లిని సేవించడం వల్ల పుత్రుడుకి ఉత్తమ లోకాలు లభిస్తాయి. తండ్రిని సేవించడం వల్ల, మహా పుణ్యం, ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. తల్లిదండ్రులు ఉన్న స్థావరమే పుత్రుడుకి గంగా- గయ వంటి పుణ్యతీర్థ స్థలం. వారిని సేవించిన సంతానానికి పుణ్యతీర్థా లస్నానఫలం కలుగుతుంది. దేవతలు, మహర్షుల ఆశీర్వచనా బలం ఉంటుంది. అంతకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి శుభ ఫలితాలు కలుగచేస్తాడు. పవిత్రమైన ఆహారంతో తల్లిదండ్రులను సంతృప్తిపరిస్తే మంచి జ్ఞానవంతులై, మంచి కీర్తిని పొందుతారు.


ఏదైనా కార్యం మీద బయటకు వెళ్ళే సమయంలో వారి ఆశీస్సులు పొందడం వల్ల విజయం సిద్ధిస్తుంది. సీతాన్వేషణ సందర్భంలో, హనుమ లంకకు వెళ్ళే ముందు మైనాకు పర్వతం చేరి, తల్లిదండ్రులకు, గురువుకు, తన రాజుకు ఎందరో మహర్షులకు మన: పూర్వక నమ స్సుమాంజలి ఘటించే ముందుకు సాగాడు.
అలాగే శ్రీ రాముడు వనవాసానికి బయలుదేరేముందు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి, ఆశీస్సులు పొందాడు. ఇటువంటి సంఘటనలే మనకు ఆదర్శం. తల్లిదండ్రుల కు ఏదైనా సందర్భంలో స్నానం చేయించేటప్పుడు వారి శరీరంనుంచి పుత్రుల శరీరం మీద పడిన నీటిబిందువు లు వల్ల సర్వతీర్థాలలో స్నానఫలం పొందుతారు.

వృద్ధులు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులు అయిన సందర్భంలో వారికి చేసిన సేవలకు శివుడు సంతోషపడి, కైలాస ప్రాప్తి కలిగిస్తాడు. వినాయక చవితి కథలో గణాల ఆధిపత్యం గురించి విఘ్నేశ్వరుడుకు తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నారాయణ మంత్రం పఠిస్తే సర్వ పుణ్యనదుల స్నానఫలితం కలుగుతుందని శివుడు తెలిపారు. తల్లిదండ్రులను బాధపెట్టే పిల్లలకు మరుసటి జన్మలో మొసళ్ళుగాను, కఠినమైన మాటలతో, మనసు. గాయపడేవిధంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో అడవిలో క్రూర జంతువులుగా పుడతారని పద్మపురాణంలో ఉంది.


పుండరీకుని కథలో పుండరీకుడు నిత్యం తల్లిదండ్రులు సేవలో నిమగ్నమై ఉండేవాడు. పాండురంగడు పరీక్షించడానికి ఇంటికి వచ్చి పిలిస్తే తాను తల్లిదండ్రుల సేవలో ఉన్నానని కాసేపు బయటే కూర్చో అంటే, పాండురంగడు బయటే నిలబడిపోయాడు. అంటే తల్లిదండ్రులు సేవలో దైవాన్ని శాసించే శక్తి ఉంటుంది.

Salakatla Teppotsavam:సాలకట్ల తెప్పోత్సవాల మహిమ

Sheethala Devi Pooja:శీతల దేవతకు ఎలాంటి పూజ చేయాలి…?

Related News

Sun Transit Horoscope: సూర్యుని దయతో ఈ రాశుల వారికి గోల్డెన్ టైం రాబోతుంది

Tirumal Laddu: పవిత్ర తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర, ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా?

Tulasi Plant: తులసి పూజ ఎప్పుడు చేయాలి, వాయు పురాణం ఏం చెబుతోందంటే..

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Big Stories

×