EPAPER

Narendra Modi: ఈ సంజీవని గొప్పవరం: మోదీ

Narendra Modi: ఈ సంజీవని గొప్పవరం: మోదీ

Narendra Modi: ఈ సంజీవని.. కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చింది ఈ యాప్. దూర ప్రాంతాల్లో ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ల నుంచి వైద్య సలహాలు పొందేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ఈ యాప్‌ను తీసుకొచ్చింది. వెబ్‌పోర్టల్, యాప్ వెర్షన్లలో ఈయాప్ అందుబాటులో ఉంది.


ఇటీవల జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ యాప్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్ డిజిటల్ విప్లవ సామర్థ్యాన్ని ఈ-సంజీవని యాప్ ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 10 కోట్ల మంది లబ్ధి పొందారని తెలిపారు. కరోనా సమయంలో జనాలకు ఈ యాప్ గొప్పవరంగా నిలిచిందన్నారు. బయటకు వెళ్లలేని వారు ఇంటి నుంచే ఈ యాప్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు.

ఇంట్లో నుంచి వైద్య సేవలు పొందాలనుకునే వారు ముందుగా ఈ యాప్‌ను వారి ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదా వెబ్ పోర్టల్ ద్వారా సేవలను పొందవచ్చు. ముందుగా యాప్ ఓపెన్ చేసి తమ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు, కొవిడ్ కేంద్రాలకు సంబంధించిన ఓపీడీ సమయాల పూర్తి సమాచారం కనిపిస్తుంది.


ఆ తర్వాత మనకు కావాల్సిన వైద్యుడిని ఎంపిక చేసుకొన్న తర్వాత మన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే టోకెన్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత మన డిటేల్స్, పాత మెడికల్ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి.

నెక్స్ట్ పై క్లిక్ చేయగానే ఒక ఐడీ నెంబర్‌తో పాటు అపాయింట్‌మెంట్ టైమ్ ఎస్సెమ్సెస్ ద్వారా మన ఫోన్‌కు వస్తుంది. ఆ సమయానికి యాప్‌ ఓపెన్ చేసి లేదా పోర్టల్‌లో కాల్ నౌ బటన్‌పై క్లిక్ చేసి డాక్టర్‌ను సంప్రదించవచ్చు. ఆ తర్వాత ఈ- ప్రిస్ర్కిప్షన్ మన ఫోన్‌కు వస్తుంది. దాని ద్వారా మందులను బయట తీసుకోవచ్చు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×