EPAPER

Lord Krishna Foot:తెలంగాణలో శ్రీకృష్ణుడు పాదం మోపిన ప్రాంతం ఎక్కడుంది

Lord Krishna Foot:తెలంగాణలో శ్రీకృష్ణుడు పాదం మోపిన ప్రాంతం ఎక్కడుంది

Lord Krishna Foot:త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం పర్యటనకు బయల్దేరి వెళ్లినసమయంలో దారిమధ్యలో ఆగిన పల్లెనే దారిలోని పల్లెగా పేరుగాంచింది. అది కాస్తా ధర్పల్లిగా స్థిరపడింది.ధర్పల్లి మీదుగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వెళ్లాడనేదానికి నిదర్శనంగా మండల కేంద్రంలోని మాలగుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య జగన్నాథుని ఆలయం నెలకొని ఉంది.


శ్రీకృష్ణుడు లోకసంచారం చేస్తూ నడయాడిన నేల కాబట్టే ఆయనకు గుర్తుగా ఆలయం నిర్మించి పూజించారు. మాలగుట్టపై పురాతన కాలంలో నిర్మించిన ఆలయం చాలా ఏళ్ల క్రితమే ఆనవాళ్లు లేకుండా కూలిపోవడంతో పక్కనే ఉన్న రెండు పెద్ద రాళ్ల మధ్యన చిన్నపాటి ఆలయం నిర్మించి మూలవిరాట్టు విగ్రహాలను ఉంచారు. ఇప్పటికీ పచ్చని ప్రకృతి ఒడిలో గుట్టపై జగన్నాథుడు కొలువై ఉన్నాడు. అయితే రాళ్లమధ్యలో ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నపాటి ఆలయం సైతం శిథిలమైపోయింది.

చిన్న దారిపల్లెగా ఉన్న గ్రామం మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ మండలంగా రూపాంతరం చెందింది. 1960-70దశకంలో గ్రామం పలు అభివృద్ధి పనులకు నోచుకున్నది. దీంతో గ్రామం రూపురేఖలు మారుతూ వచ్చాయి. జగన్నాథ ఆలయం నిర్మిస్తున్న మాలగుట్ట గోవర్ధనగిరిగా సంతరించుకుటోంది. ధర్పల్లిలో జగన్నాథుడు అడుగిడిన గొప్ప చరిత్ర కాలగర్భంలో కలిసిపోరాదనే భావనతో గ్రామస్తులు శిథిలమైన ఆలయ స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించారు.


Tirumala:తిరుమలలో మార్చి 1నుంచి కొత్త రూల్స్

Alcohol:ఏడాదికోసారి మద్యం పంచే ఆలయం ఎక్కడుంది ?

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×