EPAPER

Telangana: తెలంగాణ టుడే.. ఫటాఫట్ రౌండప్..

Telangana: తెలంగాణ టుడే.. ఫటాఫట్ రౌండప్..

Telangana: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. పట్టణంలో మన బడి మన బస్తీ కార్యక్రమంలో భాగంగా సుమారు 22 లక్షల వ్యయంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చుదిద్దుతామని ఆయన తెలిపారు.


మంచిర్యాల జిల్లాలో త్వరలోనే సీఎం కేసీఅర్ పర్యటిస్తారని బాల్క సుమన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణాల పనులు ఆయన పరిశీలించారు. ఇక.. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు 90 శాతం పనులు పూర్తి అయ్యాయని.. మార్చి 15 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్బుగూడెం గ్రామంలోని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్లు పర్యటించారు. గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ద్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఐదేళ్ల క్రితం వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేసిన వైద్యులు కడుపులోనే కత్తెక వదిలేశారు. ఇటీవల మహిళకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఎక్స్‌ రే తీయించుకుంది. దీంతో విషయం బయటపడింది. ఈ విషయం పై బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి వైద్యులను ప్రశ్నించడంతో.. మరోసారి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును తామే భరిస్తామని వైద్యులు తెలిపారు. దీంతో పరిస్థితి సర్ధుమనిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు కేటాయించిన అసైన్డ్ భూముల్లోకి ఫారెస్ట్ అధికారులు రానివ్వట్లేదని నిరసిన తెలిపారు. సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి బాధిత రైతుల ధర్నా. రైతుల ధర్నాకు జిల్లా బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిపై సర్వత్ర విమర్శలు వెళ్లు వెత్తుతున్నాయి.
ఆస్పత్రిలో రోగులను స్థానిక ఎంపీపీ తుల శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సమయంలో రోగులు వారి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సమయంలో వైద్యాధికారి లేకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా టాక్లి గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మహారాష్ట్రకు సరిహద్దు గ్రామం కావడంతో అనుమానాస్పద వ్యక్తులు రాకపోకలు సాగిస్తుంటారని ఈ ప్రోగ్రాం నిర్వహించామని పోలీసులు చెప్పారు. నిర్బంధ తనిఖీల్లో 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో సీజ్ చేశారు.

ఖమ్మం మిర్చి యార్డ్‌లో ఓ రైతు.. కమిషన్ వ్యాపారిపై దాడి చేశారు. రైతు అప్పు ఇచ్చిన వ్యాపారి.. వారి పంటను అమ్మనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో ఆగ్రహించిన రైతు వ్యాపారిని కొట్టారు. రైతుల్ని బంధించి కొట్టాలని కమిషన్ వ్యాపారులు గేట్లు మూసివేశారు. వ్యాపారుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేసారు

నిర్మల్ జిల్లా బాసరలో ఊర కుక్కలు లేగ దూడపై దాడి చేశాయి. పశువుల పాకలో ఉన్న దూడను చీల్చి పీక్కుతిన్నాయి. వీధి కుక్కల స్వైర విహారాన్ని గతంలో పలు సార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. అయినా.. అధికారుల్లో ఏమాత్రం స్పందన లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సిబ్బంది నిర్వాకం పలు విమర్శలకు దారితీస్తుంది. దేవస్థానంలోని వసతి గదులు ఇచ్చే కార్యాలయంలో పని చేసే సిబ్బంది తమ ప్లేసులో ప్రైవేటు వ్యక్తులను కూర్చోపెట్టారు. విషయం తెలుసుకున్న ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×