EPAPER

BRS : కారెక్కిన విజయవాడ మాజీ మేయర్.. ఏపీపై కేసీఆర్ వ్యూహమేంటి..?

BRS : కారెక్కిన విజయవాడ మాజీ మేయర్.. ఏపీపై  కేసీఆర్ వ్యూహమేంటి..?

BRS : తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన కేసీఆర్ .. పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. ఖమ్మంలో తొలి సభ నిర్వహించి పార్టీ లక్ష్యాలను స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే టార్గెట్ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్ లో మరో బహిరంగ సభ పెట్టి బీఆర్ఎస్ అజెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ కు కేంద్రంలో అధికారమిస్తే ఏం చేస్తామో చెప్పారు. దేశంలోని నీటి వివాదాలను ప్రస్తావించారు. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే పార్టీని పక్క రాష్ట్రాల్లో విస్తరించే చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఏపీ, ఒడిశా నుంచి కొందరు నేతలు గులాబీ గూటికి వచ్చారు.అటు మహారాష్ట్ర సభ సందర్భంగా కొందరు నేతలు కారెక్కారు.


మరోవైపు బీఆర్ఎస్ లో చేరికలు చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. జనసేనలో ఎంతో క్రియాశీలంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ కు బీఆర్ఎస్ లో చేరగానే ఏపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అదే రోజు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, బీజేపీ నేత పార్థసారధి గులాబీ కండువాలు కప్పుకున్నారు. కాస్తోకూస్తో పేరున్న ఈ ముగ్గురు నేతలు కారెక్కిన తర్వాత ఏపీ నుంచి పేరున్న నాయకులు ఎవరూ బీఆర్ఎస్ లో చేరిన దాఖలాలు లేవు.

సభ ఎప్పుడు?
మరోవైపు ఏపీలో బహిరంగ సభ పెడతామని ఎప్పుడో ప్రకటన చేశారు కేసీఆర్.. కానీ ఇంత వరకు సభకు ముహూర్తం కూడా పెట్టలేదు. అసలు బీఆర్ఎస్ తొలి సభ విజయవాడలోగానీ, గుంటూరులో నిర్వహిస్తారని అప్పుట్లో వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ తొలి సభను రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఖమ్మంలో నిర్వహించారు. ఆ తర్వాత విశాఖలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగుతుందని టాక్ వచ్చింది. ఆ సభా వేదికపైనే చాలా మంది నేతలు గులాబీ తీర్థం పుచ్చుకుంటారని మాటలు వినిపించాయి. కానీ ఇంతవరకు సభ ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితి నెలకొంది.


బీఆర్ఎస్ లో చేరికలు..
మరోవైపు బీఆర్ఎస్ లో చేరేందుకు చాలామంది నేతలు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొంతమంది గులాబీ పార్టీలో చేరారు. విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల గులాబీ కండువా కప్పుకున్నారు. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన తాడి శకుంతల తొలుత సీపీఐలో క్రియాకీలకంగా వ్యవహరించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా 2005-06లో ఏడాదిపాటు మేయర్ గా పనిచేశారు. ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ , టీడీపీల్లో పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కారెక్కారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆమెతోపాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మాల్యాద్రి, కొంతమంది మైనార్టీ నేతలు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఇలా ఏపీలో చోటామోటా నేతలు ఒక్కొక్కరూ బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఏపీలో సభ పెడితే భారీగా నేతల చేరికలు ఉంటాయని అంటున్నారు.

బీఆర్ఎస్ కార్యకలాపాలేవి..?
ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర అధ్యక్షుడు , కొంతమంది నేతలు ఉన్నారు. అయినా ఆ పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ గా సాగటంలేదు. రాష్ట్రంలో పరిస్థితులపై బీఆర్ఎస్ నేతలు స్పందించడంలేదు. మౌనంగానే ఉంటున్నారు. టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రచ్చ జరుగుతుంది. దాడులు చేసుకుంటున్న పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఈ గొడవల వల్ల సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే బీఆర్ఎస్ నేతలు తమ వైఖరేంటో చెప్పడంలేదు. దీంతో ఏపీలో బీఆర్ఎస్ శాఖ పేరుకే ఉందనే విమర్శలు వస్తున్నాయి. బహిరంగ సభ తర్వాతైనా ఏపీలో కారు స్పీడందుకుంటుందా? ఏపీపై కేసీఆర్ వ్యూహమేంటి?

Related News

Tirupati Laddu Row: తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్నారంటేనే అర్థమవుతోంది.. ఏదో జరుగుతోందని: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Laddu Prasadam: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు స్పందన ఇదే, శారదా పీఠం మౌనమేలా?

Big Stories

×