EPAPER

Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్

Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్

Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. ఒక్కసారిగా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచే రామ్, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అనేక సందర్భాల్లో వాళ్లు ఈ విషయాన్ని వెల్లడించారు.


తాజాగా రామ్‌చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తాను తండ్రి కాబోతున్న విషయం సోషల్ మీడియాలో ప్రకటించే దానికంటే ముందే తారక్‌కు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నానని వెల్లడించాడు. ఈ విషయం తెలిసి తారక్ కూడా ఎంతో సంతోషించాడని తెలిపాడు. అలాగే మెగా ఫ్యామిలీలోకి మరో వ్యక్తి రాబోతున్నందుకు తన తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

ఇక దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. రామ్‌చరణ్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. తన పిల్లలు కూడా రామ్ చరణ్‌తో ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడుతారని తెలిపాడు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. వాళ్లిద్దరి స్నేహాన్ని కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Related News

Jani Master : జానీకి రిమాండ్ విధించిన కోర్టు… బెయిల్ పరిస్థితి ఏంటంటే..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్‌గా పోరాడుతా.. లైంగిక ఆరోపణలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Big Stories

×