EPAPER

Women’s T20 World Cup: సెమీస్ లో భారత్- ఆస్ట్రేలియా ఢీ.. గెలుపెవరిది..?

Women’s T20 World Cup: సెమీస్ లో భారత్- ఆస్ట్రేలియా ఢీ.. గెలుపెవరిది..?

Women’s T20 World Cup: మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో సెమీస్ లో తలపడనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసీస్ లాంటి బలమైన ప్రత్యేర్థిని ఓడించడం అంత ఈజీ కాదు. అందుకోసం హర్మన్ సేన సర్వశక్తులా పోరాడాలి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో ఆస్ట్రేలియా జట్టు చాలా బలంగా ఉంది. మరి భారత్ సెమీస్ గండాన్ని దాటుతుందా..?


అజేయంగా ఆసీస్..
లీగ్ దశలో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 4 విజయాలతో గ్రూప్-1 లో టాప్ గా నిలిచి సెమీస్ చేరింది. అంతేకాదు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టు ఆరుసార్లు ఫైనల్ చేరింది. 2009లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ మాత్రమే ఆ జట్టు సెమీస్ లో ఓడింది. ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూసినా సెమీస్ లో ఆసీస్ జట్టే ఫేవరేట్ . కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌, అలీసా హీలీ, బెత్‌ మూనీ, తహిల మెక్‌గ్రాత్‌, ఎలీస్‌ పెర్రీ, మెగాన్‌ షట్‌.. ఇలా స్టార్లతో నిండి ఉన్న ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికకాదు.

సెమీస్ గండం గట్టేకేనా..?
భారత్ టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడం ఐదోసారి. కానీ గతంలో ఒక్కసారి మాత్రమే భారత్ ఫైనల్ కు చేరింది. అది కూడా 2020 టోర్నిలో ఇంగ్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గ్రూప్ లో అగ్రస్థానంలో ఉండటం వల్ల భారత్ నేరుగా ఫైనల్ కు వెళ్లింది. మిగతా మూడుసార్లు టీమిండియా సెమీస్ లో ఓటమినే మూటగట్టుకుంది. 2009 లో న్యూజిలాండ్, 2010లో ఆస్ట్రేలియా, 2018లో ఇంగ్లాండ్ చేతిలో సెమీస్ లో ఓడింది. అయితే 2021 మార్చి నుంచి ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లతో కలిపి ఆసీస్ రెండు మ్యాచ్ ల్లో మాత్రమే ఓడింది. ఆ రెండుసార్లు ఆసీస్ ను భారత్ జట్టే ఓడించడం చెప్పుకోవాల్సిన విషయం. టీ20 ప్రపంచ కప్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు 5 సార్లు తలపడ్డాయి. అందులో ఆసీస్ 3 సార్లు గెలవగా.. భారత్ 2 సార్లు విజయం సాధించింది. అలాగే భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 30 టీ 20 మ్యాచ్ లు జరిగాయి. అందులో ఆసీస్ 22 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. భారత్ 7 మ్యాచ్ ల్లో గెలిచింది. ఓవరాల్ గా చూసినా ఆసీస్ దే అధిపత్యం.


సమిష్టిగా రాణిస్తేనే..
భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్లు సాధించాలి. అలాగే ఈ టోర్నిలో పెద్దగా రాణించని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ లోనైనా సత్తాచాటాలి. రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్ లీగ్ మ్యాచ్ ల్లో చూపించిన తెగువను ఈ మ్యాచ్ లోనూ ప్రదర్శించాలి. అలాగే దీప్తి శర్మ బ్యాటింగ్ లో రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ లో పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ సత్తా చాటాలి. స్పిన్నర్ దీప్తిశర్మ రాణించాలి. ఇలా బ్యాంటింగ్ , బౌలింగ్ లో భారత్ సమిష్టిగా రాణిస్తే ఆసీస్ ను ఓడించడం కష్టం కాదు. అదే సమయంలో ఫీల్డింగ్ లో నూ భారత్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మరి భారత్ సెమీస్ గండాన్ని దాటుతుందా? సమిష్టిగా రాణించి ఆసీస్ ను ఓడిస్తుందా?

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×