EPAPER

CRED Vs CheQ:CREDకు పోటీగా CheQ.. ఏది బెటరంటే?

CRED Vs CheQ:CREDకు పోటీగా CheQ.. ఏది బెటరంటే?

CRED Vs CheQ:క్రెడిట్ కార్డులు వాడుతున్న వాళ్లలో చాలా మందికి CRED యాప్ సుపరిచితమే. క్రెడిట్ కార్డులు, వాటి బిల్లుల వివరాలన్నీ ఒకే దగ్గర చూపించడమే కాదు… చెల్లింపుల తర్వాత క్షణాల్లో ఆ మొత్తాన్ని క్రెడిట్ కార్డుల అకౌంట్లలో జమ చేయడం CRED ప్రత్యేకత. 2018 ఏప్రిల్ నుంచి సేవలు ప్రారంభించిన CRED.. చాలా తక్కువ సమయంలోనే యూజర్లను ఆకట్టుకుంది. తన అద్భుతమైన సర్వీసుతో గత ఐదేళ్లుగా ఎదురేలేని CREDకు పోటీగా… ఇప్పుడు మరో యాప్ వచ్చేసింది. అదే CheQ. ఈ రెండు యాప్‌ల్లో ఏది, ఎందులో బెటరో తెలుసుకుందాం.


ఇప్పుడు CRED యాప్ ద్వారా కేవలం క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు మాత్రమే కాదు… CRED Payతో మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్, విద్యుత్, బ్రాడ్ బ్యాండ్ సహా ఎన్నో నెలవారీ బిల్లులు చెల్లించే సౌలభ్యం ఉంది. రీలోడ్‌లు, యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపులు, వ్యక్తిగత రుణాల సేవలతో పాటు… ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్ సహా ఎన్నో ఉత్పత్తుల్ని కొనుగోలు చేయగల ప్రత్యేక స్టోర్‌ను కూడా నిర్వహిస్తోంది… CRED. అలాగే ట్రావెల్ సెక్షన్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యటనలను కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన CheQలో మాత్రం… ప్రస్తుతం క్రెడిట్ కార్డ్ బిల్లులు మాత్రమే చెల్లించే అవకాశం ఉంది. ఇక CRED ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తే… గరిష్టంగా 15 నిమిషాల్లోపే ఆ మొత్తం క్రెడిట్ కార్డు అకౌంట్లో జమ అవుతుంది. కానీ CheQ మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకుంటోంది. క్రెడిట్ కార్డ్‌ చెల్లింపును డిపాజిట్ చేయడానికి తక్కువలో తక్కువ 8 గంటల నుంచి 48 గంటల వరకు సమయం తీసుకుంటోంది… CheQ. ఎలాంటి సమస్యలు లేకుండా లావాదేవీలు పూర్తైనా… ఎక్కువ సమయం తీసుకోవడం CheQకు ప్రతికూల అంశమే.

ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే… రివార్డ్ పాయింట్స్. CRED రూ.1 బిల్లు చెల్లించినందుకు ఒక రివార్డ్ కాయిన్ ఇస్తుంది. వాటి ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్ సహా ఇతర ఓచర్లు గెలుచుకునే అవకాశం ఉంది. సేవలు ప్రారంభించిన తొలినాళ్లలో CRED రివార్డ్ పాయింట్స్ ద్వారా వినియోగదారులకు ఎక్కువ మొత్తంలో క్యాష్ బ్యాక్ వచ్చేది. ప్రస్తుతం అది చాలా తక్కువగా వస్తోంది. ఇక CheQలో రివార్డ్ పాయింట్స్.. ప్రస్తుతానికి కస్టమర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిప్‌ల రూపంలో ప్రతి లావాదేవీపై 1% రివార్డ్ కాయిన్స్ ఇస్తోంది… CheQ. అంటే రూ.100 క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తే 1 చిప్ వస్తుంది. వాటిని నగదుగా మార్చుకోవచ్చు, లేదా అమెజాన్, ఫ్లిప్ కార్డ్, స్విగ్గీ లాంటి ఎన్నో కంపెనీల వోచర్లు పొందే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 4 చిప్‌లకు రూ.1 నగదు అందిస్తోన్న CheQ.. వోచర్లకైతే ఒక చిప్ మీద 50 పైసలు ఇస్తోంది. ఒక్కో యూజర్ ప్రతినెలా గరిష్టంగా 4000 చిప్‌లు పొందే అవకాశం ఉంది. అంటే రూ.1000 క్యాష్ బ్యాక్ లేదా… రూ.2000 విలువైన వోచర్ పొందవచ్చు. CREDతో పోలిస్తే CheQ రివార్డ్ స్కీమే ప్రస్తుతానికి ఆకర్షణీయంగా ఉంది.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×