చలికాలంలో మీ చర్మం డ్రైనెస్‌ని తగ్గించడానికి మాయిశ్చరైజర్, కోల్డ్ క్రీమ్స్‌ని అప్లై చేసుకోవాలి.. నీరు అధికంగా తాగడం వల్ల కూడా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
రెగ్యలర్‌గా వ్యాయామం చేస్తే మీ శరీరం వెచ్చగా మారి మీరు మరింత యాక్టివ్‌గా ఉంటారు. చలి కాలంలో వ్యాపించే రోగాలనెదుర్కోవడానికి ఇమ్మునిటీ కూడా పెరుగుతుంది
చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. ఎండ మీ బాడీకి తగిలేవిధంగా బయటకు వస్తూ ఉండండి. లేదంటే బాడీలో విటమిన్ డి తగ్గుతుంది.
ఎండ తక్కువగా ఉండడం వల్ల బాడీలో మెలటోనిన్ పెరుగుతూ ఉంటుంది. ఇది మిమ్మల్ని నిద్రమత్తులోకి జారుకునేలా చేస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి
మీ చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. లేదంటే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ అధికంగా వ్యాపించేలా ఉంటుంది.
గొంతునొప్పి, గొంతు సమస్యలు రాకుండా ఉండేందుకు.. గోరువెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి పుక్కలించడం వల్ల మీ ఈ సమస్యల నుంచి మీరు బయట పడతారు.