EPAPER

film festival awards : ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ RRR.. ఆ కపుల్ కు బెస్ట్ యాక్టర్స్ అవార్డ్..

film festival awards : ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ RRR.. ఆ కపుల్ కు బెస్ట్ యాక్టర్స్ అవార్డ్..

film festival awards : దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ముంబైలో ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. స్టైలిష్‌ డ్రెస్సుల్లో మెరిశారు. వరుణ్‌ ధావన్‌, రోనిత్‌ రాయ్‌, శ్రేయా తల్పాడే, షాహిల్‌ ఖాన్‌, నటాలియా, వివేక్‌ అగ్నిహోత్రి, రిషబ్‌ శెట్టి, హరిహరన్‌ ఈ వేడుకకు హాజరయ్యారు.


ఆ సినిమాలకు అవార్డులు ..
ఇప్పటికే ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న RRR మూవీ ఇప్పుడు మరో పురస్కారాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డును కైవసం చేసుకుంది. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR కు దక్కింది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన కాంతారా చిత్రాన్ని అవార్డు వరించింది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రిషభ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. బ్రహ్మస్త్ర-1 లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రణ్ బీర్ కపూర్ ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్నారు. గంగూబాయి కాఠియావాడి సినిమాలో అద్భుత నటనతో మెప్పించిన అలియా భట్ ను ఉత్తమనటి పురస్కారం వరించింది.

ఉత్తమ చిత్రం.. ది కశ్మీర్ ఫైల్స్..
దేశవ్యాప్తంగా పెనువివాదాలు రేపిన సినిమా.. ది కశ్మీర్ ఫైల్స్. ఇప్పటికే ఈ సినిమాపై ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. ఈ సినిమాకు మద్దతుగా నిలిచే వర్గానికి , వ్యతిరేకించే వర్గానికి సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఉత్తమ చిత్రం అవార్డును సొంతం చేసుకుంది.


బెస్ట్ యాక్టింగ్ కపుల్..
బ్రహ్మస్త్ర-1 సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకున్న రణ్ బీర్ కపూర్.. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండి అవార్డుల వేడుకకు హాజరు కాలేకపోయాడు. దీంతో అలియానే భర్తకు వచ్చిన ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఇలా భార్యభర్తలకు బెస్ట్ యాక్టర్స్ అవార్డు రావడం విశేషం. దీంతో ఆ రెండు అవార్డులను ఆమె స్వీకరించింది. చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గానూ 2023 సంవత్సరానికి అవార్డును రేఖ అందుకున్నారు.

అవార్డుల వివరాలు ఇవే..
ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ చిత్రం : ది కశ్మీర్‌ ఫైల్స్‌
ఉత్తమ దర్శకుడు: ఆర్‌.బాల్కి (చుప్‌ : ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)
ఉత్తమ నటుడు‌ : రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)
ఉత్తమ నటి : అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ : రిషబ్‌శెట్టి (కాంతారా)
క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ : వరుణ్‌ ధావన్‌ (బేడియా)
మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ : అనుపమ్‌ ఖేర్‌
బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ : సాచిత్ తాండన్‌
క్రిటిక్స్‌ ఉత్తమ నటి : విద్యాబాలన్‌ (జల్సా)

వెబ్‌ సిరీస్‌ విభాగంలో అవార్డు..
ఉత్తమ వెబ్‌ సిరీస్‌: రుద్ర : ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌
ఉత్తమ నటుడు : జిమ్ షార్బ్ (రాకెట్‌ బాయ్స్‌)
టెలివిజన్‌ సిరీస్ ఆఫ్‌ ఆది ఇయర్‌ : అనుపమ (సీరియల్‌)

Related News

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Big Stories

×