EPAPER

Subscription Sharges:మస్క్ బాటలో మార్క్

Subscription Sharges:మస్క్ బాటలో మార్క్

Subscription Sharges:44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్‌ను కొన్న ఎలాన్ మస్క్… ఉద్యోగుల్ని తీసేయడంతో పాటు… సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమంటూ… బ్లూ టిక్, గోల్డ్ కలర్ బ్యాడ్జ్ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీల పేరుతో యూజర్ల నుంచి నెలవారీగా వసూళ్లు మొదలుపెట్టాడు. ఇదేదో బాగుందే అనుకున్న మిగతా కంపెనీలు కూడా ఇప్పుడు మస్క్ బాటలోనే నడుస్తున్నాయి. ఇన్నాళ్లూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవల్ని ఉచితంగానే అందించిన మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌… మస్క్ మాదిరే నెలవారీగా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించాడు. దాంతో… ఇలా సోషల్ మీడియా సంస్థలు ఛార్జీలు విధించుకుంటూ పోతే… అన్నింటికీ డబ్బు కట్టేదెలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు బ్లూ టిక్ కోసం నెలవారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మార్క్ జుకర్‌బర్గ్‌ తాజాగా ప్రకటించాడు. ఐఓఎస్‌ యూజర్ల నుంచి నెలకు 14.99 డాలర్లు, వెబ్‌ యూజర్ల నుంచి నెలకు 11.99 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించాడు. అయితే… ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మాత్రమే ఈ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. ఆ తర్వాత క్రమంగా అన్ని దేశాల యూజర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

ప్రభుత్వ ఐడీలతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లూ టిక్‌ హోల్డర్ల అకౌంట్లు పరిశీలిస్తామని మార్క్ జుకర్‌బర్గ్‌ ప్రకటించాడు. వెరిఫికేషన్‌ వల్ల ఫేక్‌ అకౌంట్ల నుంచి యూజర్లు సురక్షితంగా ఉండే అవకాశం కలుగుతుందని జుకర్‌బర్గ్‌ తెలిపాడు. కొత్త ఫీచర్ వల్ల యూజర్లలో విశ్వసనీయత పెరగడంతోపాటు… రీచ్, సెక్యూరిటీ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు.


ఇండియాలో ఇప్పటికే ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు… నెలకు రూ.900 చెల్లిస్తున్నారు. అదే వెబ్‌ యూజర్లు అయితే నెలకు రూ.650 చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే… ఒక్కోదానిపై నెలకు మరో రూ.1000 అదనపు భారం తప్పదు. అంటే కేవలం ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల కోసమే మొబైల్ యూజర్లు నెలకు రూ.2000 ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట.

Gold Rates : నేడు బంగారం ధర ఎంతో తెలుసా..?

Rekha Jhunjhunwala:2 వారాల్లో రూ.1,000 కోట్లు లాభం.. ఎవరికంటే..

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×