EPAPER

Taraka Ratna: తారకరత్నకు ప్రముఖుల సంతాపం..

Taraka Ratna: తారకరత్నకు ప్రముఖుల సంతాపం..

Taraka Ratna: నందమూరి తారకరత్న మృతి చెందడంతో సినీఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


సీఎం కేసీఆర్ సంతాపం
తారకరత్న మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మా కుటుంబంలో విషాదం మిగిల్చాడు..
23 రోజుల పాటు తారకరత్న మృత్యువుతో పోరాడి.. చివరికి కన్నుమూసి తమ కుటుంబంలో విషాదం మిగిల్చాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని వెల్లడించారు. ఆయనను బ్రతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు, అభిమానుల ప్రార్థనలు, డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదన్నారు.


సీఎం జగన్ దిగ్భ్రాంతి
తారకరత్న మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బావా అంటూ ఆప్యాయంగా పిలిచే గొంతు మూగబోయింది
బావా అంటూ ఆప్యాయంగా పిలిచే తారకరత్న గొంతు ఇక వినిపంచదన్న విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ‘‘నేనున్నానంటూ నా వెంట నడిచిన తారకరత్న అడుగుల చప్పుడు ఆగిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది’’ అని అన్నారు.

సినీ ఇండస్ట్రీకి తీరని లోటు
తారకరత్న మరణవార్త తనను ఎంతగానో కలచివేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటన్నారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

షాక్ అయ్యాను..
తారకరత్న మరణవార్త విని షాకయ్యానని సినీనటుడు మహేశ్‌బాబు అన్నారు. చిన్నవయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Taraka Ratna: పెద్దలు నో చెప్పినా.. అలేఖ్యను పెళ్లాడిన తారకరత్న

Taraka Ratna: తిరిగిరాని లోకాలకు తారకరత్న.. ఇదీ ఆయన ప్రస్థానం..

Related News

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Actress : యాడ్ షూట్ లో డర్టీ పనులు… స్టార్ హీరో అసభ్యకరంగా తాకాడంటూ హీరోయిన్ ఆరోపణలు

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Sobhita Dhulipala: అక్కినేని కోడలా.. మజాకానా.. ఎమ్మీ అవార్డ్స్ కు శోభితా బోల్డ్ సిరీస్

Chiranjeevi : పక్కొడి పనిలో వేలు పెడుతారు… చాలా కాన్ఫిడెంట్‌గా చిరుకి కౌంటర్

Akhil Akkineni: అయ్యగారిలో ఇంత కసి ఉందా.. నాగర్జున వ్యాఖ్యలు వైరల్

Renu Desai: ప్లీజ్ సాయం చెయ్యండి.. హెల్ప్‌లెస్‌గా ఉన్నాను.. రేణు దేశాయ్ వేడుకోలు

Big Stories

×