EPAPER

Global Warming:సూర్యకాంతితో గ్లోబల్ వార్మింగ్ అదుపులోకి..

Global Warming:సూర్యకాంతితో గ్లోబల్ వార్మింగ్ అదుపులోకి..

Global Warming:గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయడానికి ఇప్పటికే పర్యావరణవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తోడుగా పరిశోధకులు, శాస్త్రవేత్తలు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇందులో చాలామందికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందుతోంది. తాజాగా ఆఫ్రికా, ఆషియా, సౌత్ అమెరికా పరిశోధకులు ఈ విషయంలో పరిశోధనలు చేయడానికి 9,00,000 డాలర్ల ఆర్థిక సాయం అందింది.


భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. దీనిని అదుపు చేయడానికి పర్యావరణవేత్తలు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా సూర్యకాంతి వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనను మరింత మెరుగుచేయడానికి ఫేస్‌బుక్ కో ఫౌండర్ డస్టిన మోస్కోవిట్జ్ 9 లక్షల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించారు. వీటిలో పలు దేశాలకు సంబంధించిన పరిశోధకులు కలిసి పనిచేయనున్నారు.

సూర్యకాంతి ప్రతిబింబం నుండి సల్ఫర్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది తిరిగి సూర్యకాంతిని అంతరిక్షం వరకు తీసుకెళ్తుంది. దీనినే సోలార్ రేడియేషన్ మోడిఫికేషన్ లేదా సోలార్ జియోఇంజనీరింగ్ అంటారు. దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్ అదుపు చేసే అవకాశం ఉందని వారు పరిశోధకులు భావిస్తున్నారు. సోలార్ జియోఇంజనీరింగ్‌తో పరిశోధనలు చేయాలని వారు ఎప్పటినుండో అనుకుంటున్నా.. ఇప్పుడు కలుగుతున్న పర్యావరణ మార్పులు ఈ పరిశోధనలు వేగవంతం అయ్యేలా చేశాయి.


సోలార్ జియోఇంజనీరింగ్ వల్ల పలు ప్రమాదాలు కూడా జరగవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఓజోన్ లేయర్‌కు డ్యామేజ్ జరగడం, ఆసిడ్ రెయిన్, శ్వాస సంబంధింత వ్యాధులు రావడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి 81 అనుభవం ఉన్న పరిశోధకులు కలిసి పనిచేయనున్నారు. వీరందరూ కలిసి 15 జియోఇంజనీరింగ్ ప్రాజెక్టులను తయారు చేయనున్నారు. సూర్యకాంతితో గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయడమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×