EPAPER

Hindenburg: టార్గెట్ అదానీనా? షార్ట్ సెల్లింగా? హిండెన్ బర్గ్ లోగుట్టు ఏంటి?

Hindenburg: టార్గెట్ అదానీనా? షార్ట్ సెల్లింగా? హిండెన్ బర్గ్ లోగుట్టు ఏంటి?

Hindenburg: అదానీ వర్సెస్ హిండెన్ బర్గ్ ఇష్యూలో ఎవరు ఎక్స్ పోజ్ అయ్యారు? ఒక రకంగా అదానీ షేర్లు పడిపోవడం, ఆస్తులు తరిగిపోవడంతో అదానీ గ్రూప్ కు ఎఫెక్ట్ అయితే అయింది. ఇది నాణేనికి ఒకవైపు. మరి ఇంకోవైపు హిండెన్ బర్గ్ వ్యవహారం కూడా ఎక్స్ పోజ్ అయిందా… అంటే అవుతోందంటున్నారు నెటిజన్లు. ‘హిండెన్ బర్గ్ ఎక్స్ పోజ్డ్’.. ప్రస్తుతం ఈ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ కంపెనీ గురించి రకరకాల చర్చలు, వాదోపవాదాలు, నెగెటివ్, పాజిటివ్ కామెంట్లు ఇలా పెద్ద ఎత్తున డిబేట్ అయితే జరుగుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఇవ్వడం వరకు బాగానే ఉన్నా.. ఇలాంటి రిపోర్టుల రిలీజ్ కు ముందు తెరవెనుక ఏమేం జరుగుతోంది.. ఆ రిపోర్టులు ఎక్కడెక్కడ లీకవుతున్నాయి.. ఇలాంటి పాయింట్ల చుట్టూ ఇప్పుడు వ్యవహారం తిరుగుతోంది. హిండెన్ బర్గ్ ఇలా రిపోర్టులు రిలీజ్ చేస్తూ.. ట్రేడింగ్ లో షార్ట్ సెల్లింగ్ కు కారణమవుతోందన్న విమర్శలు సోషల్ మీడియాలో పెరుగుతున్నాయి. ఈ యూఎస్ కంపెనీ వ్యవహారంపై ప్రస్తుతానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణలో ఉందని చెబుతున్నారు.


హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్‌ ను సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలాంటి కార్పొరేట్ డిజాస్టర్లను ముందుగానే పసిగట్టడం, వాటి నుంచి లాభాలు ఎలా పొందాలో బాగా ఆరితేరిన వ్యక్తిగా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో చర్చోపచర్చలు ఎలా ఉన్నా.. వాస్తవాల్లోకి వెళ్లి చూస్తే అసలు పరిస్థితి తెలుస్తుందంటున్నారు. ఇలాంటి ఎక్స్ ప్లోజివ్ రిపోర్ట్స్ ఇచ్చే ముందు ఏం జరుగుతుందన్నది తేల్చగలిగితేనే అసలు స్టోరీలు బయటికొస్తాయంటున్నారు.

కార్పొరేట్ల మోసాలను బహిర్గతం చేయడం కాదు.. ఇలాంటి సంస్థలే మోసాలకు పాల్పడుతున్నాయన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి 2021 తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ స్కానర్ లో ఈ తరహా కంపెనీలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఏదైనా సంస్థకు కచ్చితంగా నష్టం చేకూర్చే రిపోర్టులను ముందుగానే రివీల్ చేయడం అలవాటుగా మారిపోయిందని, వీటితో లాభాలు గెయిన్ చేస్తున్నారన్న టాక్ అయితే ఉంది. స్టాక్ మార్కెట్ లో షార్ట్ సెల్లింగ్ అన్నది ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది.


ఏదైనా కంపెనీ స్టాక్ ధర పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్లలో షార్ట్ సెల్లింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇప్పుడు అదానీ గ్రూప్ షేర్ల పతనం టైంలోనూ షార్ట్ సెల్లింగ్స్ జరిగాయి. స్టాక్ మార్కెట్లో ఇలాంటి ప్రాక్టీస్ చాలా తప్పు అన్న వాదన ఉంది. అదే సమయంలో షార్ట్ సెల్లింగ్స్ తో బెనిఫిట్ కూడా ఉందన్న వారూ ఉన్నారు. అయితే ఇది ఇల్లీగల్ అంటున్న వారే ఎక్కువున్నారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు పొందడం షార్ట్ సెల్లింగ్ మెయిన్ థీమ్. అయితే ఇందులో నష్టం భయాలు కూడా భారీగానే ఉంటాయి. ఈ తరహా ట్రేడింగ్ లో షార్ట్ సెల్లర్లు అప్పుగా తెచ్చుకున్న సెక్యూరిటీలను అమ్ముతారు. వీటిని తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం పాత కేసుల్లో ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ రంగంలోకి దిగి ట్రేడింగ్ రికార్డులు, హార్డ్ వేర్, ప్రైవేట్ కమ్యూనికేషన్ కు సంబంధించిన ఆధారాలను సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. స్టాక్ ధరలను తగ్గించడానికి షార్ట్ సెల్లర్స్ తెరవెనుక ఏదైనా కథ నడిపారా లేదా అన్నది తేల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హిండెన్ బర్గ్, నాథన్ అండర్సన్ ఇద్దరిపై US డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ ఫోకస్ పెట్టిందంటున్నారు. అయితే ఈ సంస్థపై ఇప్పటివరకు ఎలాంటి నేర అభియోగాలు రుజువు కాలేదు. ఎవరూ మోపలేదంటున్నారు. మరోవైపు అదానీ గ్రూప్ షేర్లు, బాండ్ల వాల్యూ పతనం అవుతున్నప్పుుడు షార్ట్ పొజిషన్ తీసుకున్న విదేశీ ట్రేడర్లు లాభాలు పొందుతుండడం కీలకమైన విషయం. మొత్తంగా ఈ వ్యవహారం అదానీ గ్రూప్ ను షేక్ చేస్తే.. షార్ట్ సెల్లర్స్ పంట పండిస్తోంది. అదానీ గ్రూప్ అకౌంటింగ్ మోసాలు, షేర్ల వాల్యూ పెంచుకోవడం, వాటిని చూపి రుణాలుగా తీసుకోవడంపై హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసింది. అయితే వీటిపై దర్యాప్తు చేస్తే అసలు విషయాలు తెలుస్తాయి. మరోవైపు ఈ ఇష్యూతో మనదేశంలో స్టాక్ మార్కెట్లలో షార్ట్ సెల్లింగ్ పై జోరుగా చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు షార్ట్ సెల్లింగ్ కోసం అదానీ గ్రూప్ ను ఇరికించే ప్రయత్నాలు జరిగాయా అన్న కోణంలోనూ మన దగ్గర ఎంక్వైరీ సంస్థలు దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Tags

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×