EPAPER
Kirrak Couples Episode 1

Movies: ఓటీటీ, థియేటర్లలో ఈ వారం వచ్చే సినిమాలు ఇవే..

Movies: ఓటీటీ, థియేటర్లలో ఈ వారం వచ్చే సినిమాలు ఇవే..

Movies: సినీ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రతివారంలానే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. అటు ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి.


థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాలు..

కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా.. దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ‘అమిగోస్’. మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిషబ్‌శెట్టి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సినిమా ‘కాంతార’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కన్నడ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. శివ రాజ్‌కుమార్, గన్వి లక్షణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వేద’. డైరెక్టర్ హర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

యంగ్ హీరో సాయి రోనక్, ఆవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పాప్‌కార్న్’. మురళీగంధం దర్శకత్వంలో భోగేంద్రగుప్త నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. శ్రవణ్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

సురేశ్ లంకపల్లి దర్శకత్వంలో విశ్వ కార్తికేయ, నితిన్ నషా, అర్చనా గౌతమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఐపీఎల్’. బీరం శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10 థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ మధ్యకాలంలో చెడ్డీ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. చెడ్డీ గ్యాంగ్స్‌పై అవగాహన కల్పిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘చెడ్డీ గ్యాంగ్’. వెంకట్ కల్యాణ్ జి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకట్, గాయత్రి, క్రాంతి కిరణ్, విజయ్ కార్తిక్, చైతన్య, తేజ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తెగింపు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు ఈ మూవీ రెడీ అవుతోంది. ఈనెల 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

సాయి రోనక్, అంకిత సాహా హీరోహీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం ‘రాజయోగం’. రామ్ గణపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, కేకే మేనన్, రాశీఖన్నా కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఫర్జీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం ‘కళ్యాణం కమనీయం’. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిల్ కుమార్ ఆశ్ దర్శకత్వం వహిచించారు. ఈ మూవీ ఫిబ్రవరి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది.

అలాగే ‘బిల్ రస్సెల్’, ‘యు’ అనే రెండు వెబ్‌సిరీస్‌లు ఫిబ్రవరి 8న నెట్‌ప్లిక్స్‌లో రిలీజ్ కాబోతున్నాయి. ‘నాట్ డెడ్ ఎట్’ అనే వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Related News

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Big Tv Exclusive : దసరాకి గేమ్ ఛేంజర్ ట్రైలర్… చెర్రీ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు రెడీ అవ్వండమ్మా

Manchu Vishnu: పవన్ కు సపోర్ట్ సరే.. పూనమ్ ఇచ్చిన ఫిర్యాదు సంగతేంటీ.. ప్రెసిడెంట్ గారు ?

Jayam Ravi : జయం రవితో ఎఫైర్ పై ప్రశ్న… నెటిజన్ కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సింగర్

The Mystery Of Moksha Island Review: చావును ఎదిరించి మనిషి బతుకుతాడా.. తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

Samantha: హేమా కమిటీ టాలీవుడ్ లో వేయాలన్న సమంత.. మరి జానీ మాస్టర్ కేసు పై నోరు మెదపదా..?

Jani Master Case : జానీ మాస్టర్ చేసిన తప్పు అదే… ఎట్టకేలకు నిజం బయట పెట్టిన భార్య

Big Stories

×